Renu Desai Insta Post : పొలిటికల్ అడుగు… ఈ పార్టీకి ప్రచారం చేయబోతున్న పవన్ కళ్యాణ్ మాజీ భార్య

Renu Desai Insta Post.. దేశంలో ప్రస్తుతం ఎక్కువగా ఎన్నికల హడావిడి కొనసాగుతోంది.. కొన్నిచోట్ల పోలింగ్ కూడా ఆల్రెడీ జరిగింది. మరి కొన్నిచోట్ల త్వరలోనే జరగబోతున్న సమయంలో పలువురు నేతలు కూడా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా వాడీ వేడిగా స్పీచ్ లు ఇస్తున్నారు నేతలు. అయితే ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన సోషల్ మీడియా నుంచి ఒక మహిళ నేతపైన పోస్ట్ చేస్తూ ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేసింది వాటి గురించి చూద్దాం.

Renu Desai Insta Post : Political step...Pawan Kalyan's ex-wife who is going to campaign for this party
Renu Desai Insta Post : Political step…Pawan Kalyan’s ex-wife who is going to campaign for this party

బిజెపి మహిళ నేతకు అండగా..

గత కొద్దిరోజులుగా హైదరాబాద్ బిజెపి ఎంపీ అభ్యర్థి ప్రసంగాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఆమె విల్లు ఎక్కుపెట్టే విజువల్స్ ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. ఆమె ఎవరో కాదు బిజెపి నేత మాధవి లత ..ఈమె ప్రసంగాలు.. ఈమె చెబుతున్న సూక్తులు.. చెబుతున్న మాటలు అన్నీ కూడా అందరిని ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి.. తాజాగా రేణు దేశాయ్ పోస్ట్ చేస్తూ కూడా మాధవి లతను పొగిడేస్తూ కామెంట్స్ చేసింది. ముఖ్యంగా ఈమె ఇలాంటి ధైర్యశాలిని ఈ మధ్యకాలంలో తాను ఎప్పుడూ చూడలేదు అంటూ కూడా రేణూ దేశాయ్ ప్రశంసించింది. ఇలాంటి పోస్ట్ చేసినందుకు తాను ఏమి డబ్బులు తీసుకోలేదని కూడా పోస్టులో రాస్తూ క్లారిటీ ఇచ్చేసింది.

వారికి భయపడే పోస్ట్ పై క్లారిటీ..

ముఖ్యంగా సెలబ్రిటీల అందరూ కూడా డబ్బులు తీసుకుని ఇలాంటి పనులు చేస్తూ ఉంటారనే రూమర్స్ వినిపిస్తూ ఉన్న తరుణంలో రేణు దేశాయ్ ఇలా ముందుగానే క్లారిటీ ఇచ్చేసింది. కేవలం తన మనసులో మాటని ఇలా తెలియజేశాను అంటూ తెలియజేసింది రేణూ దేశాయ్. ముఖ్యంగా ఈ విషయం పైన చాలామంది నెగటివ్ కామెంట్స్ చేస్తారని ఉద్దేశంతోనే కామెంట్ బాక్స్ ను కూడా క్లోజ్ చేసినట్లు కనిపిస్తోంది. చాలా సందర్భాలలో కూడా రేణు దేశాయ్ కామెంటు సెక్షన్ క్లోజ్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా అలాంటిదే చేసింది ఈ ముద్దుగుమ్మ.

- Advertisement -

నిరాశలో పవన్ కళ్యాణ్ అభిమానులు..

ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సందర్భంగా కూడా ఈమె ఇప్పటివరకు ఎలాంటి విధమైనటువంటి పోస్టులు అయితే చేయలేదు కానీ గెలవాలని కోరుకుంటున్నాను అని ఎన్నోసార్లు తెలియజేసింది రేణు దేశాయ్.. అయితే ఇప్పుడు తాజాగా ఇలా బిజెపి నేత మాధవి లతా పైన పోస్ట్ చేయడంతో రేణు దేశాయ్ ధైర్యాన్ని సైతం మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. పవన్ అభిమానులు కూడా తనని సపోర్ట్ చేయమని ఎన్నో సందర్భాలలో అడిగారు. కానీ రేణూ దేశాయ్ మాత్రం పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలవలేదు. అయితే ఇప్పుడు బిజెపి మహిళా నేత పోస్ట్ షేర్ చేయడంతో కొంతమంది ఈమె ఆమెను సపోర్ట్ చేస్తోంది అంటే కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.. ఏది ఏమైనా రేణు దేశాయ్ తనకు నచ్చిందే చేస్తుంది అని మరోసారి నిరూపించింది.

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు