OMG 2 Telugu on OTT : తెలుగులో వచ్చేసిన అక్షయ్ కుమార్ బ్లాక్ బస్టర్ మూవీ… స్ట్రీమింగ్ ఏ ఓటీటీలో అంటే?

OMG 2 Telugu on OTT : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఓ మై గాడ్ 2 తాజాగా తెలుగులో రిలీజ్ అయింది. ఈ మూవీ హిందీలో రిలీజ్ అయిన చాలా కాలం తర్వాత ఒకేసారి తెలుగులో రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కావడం విశేషం. మరి ఇంతకీ ఓ మై గాడ్ 2 మూవీ తెలుగులో ఏ ఓటిటిలో అందుబాటులో ఉంది? అంటే…

తొమ్మిది నెలల తరువాత తెలుగులోకి…

ఓ మై గాడ్ మూవీలో అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాటి, యామి గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించారు. అమిత్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2012లో రిలీజ్ అయ్యింది. దీనికి సీక్వెల్ గా వచ్చిన ఓ మై గాడ్ 2 మూవీలో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపించారు. 2023 ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఏకంగా 220 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. అప్పటిదాకా వరుస డిజాస్టర్లతో సతమతమైన అక్షయ కెరీర్ కు ఈ మూవీ సక్సెస్ కావడం బూస్ట్ ని ఇచ్చింది. అంతేకాకుండా ఓ మై గాడ్ 2 మూవీ గత ఏడాది బాలీవుడ్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన టాప్ టెన్ సినిమాల్లో ఒకటిగా రికార్డును క్రియేట్ చేసింది. ఇక హిందీలో రిలీజైన తొమ్మిది నెలల తరువాత తెలుగులోకి వచ్చింది ఈ మూవీ.

రెండు ఓటీటీలలో..

తాజాగా ఓ మై గాడ్ మూవీ నెట్ ఫ్లిక్స్ తో పాటు జియో సినిమాలో రిలీజ్ అయింది. 2023 అక్టోబర్ నుంచి హిందీలో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ తాజాగా తెలుగులో కూడా రిలీజ్ కావడం విశేషం. అది కూడా రెండు ఓటీటీల్లో.

- Advertisement -

ఓ మై గాడ్ 2కు సెన్సార్ సమస్యలు…

ఇక ఓ మై గాడ్ 2 మూవీలో పలు సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ముఖ్యంగా అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపించడంపై ఓ వర్గం వారు మండిపడ్డారు. మనోభావాలు దెబ్బతీసేలా మూవీ కథనం ఉందంటూ ఫైర్ అయ్యింది దీంతో అక్షయ్ కుమార్ పేరును ఈ సినిమాలో శివుడిగా కాకుండా దేవదూతగా మార్చారు మేకర్స్. అయినప్పటికీ ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ను జారీ చేసింది. అంతేకాదు సినిమాలో 20 సీన్లకు కట్ చెప్పారు.

కోర్టు మెట్లెక్కిన చిత్రబృందం..

సెన్సార్ తీరుపై మేకర్స్ సీరియస్ అయ్యి కోర్టును కూడా ఆశ్రయించారు. అక్కడి నుంచి ఈ మూవీ రివిజన్ కమిటీ దగ్గరకు వెళ్ళింది. అయినప్పటికీ తిప్పలు తప్పలేదు ఓ మై గాడ్ 2 మేకర్స్ కి. రివిజన్ కమిటీ ఏకంగా 25 మార్పులు సూచించింది. అంతేతప్ప ఏం సర్టిఫికెట్ ను మాత్రం మార్చలేదు. ఎన్నో అడ్డంకులు దాటుకొని థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మరి ఈ మూవీ తెలుగు వెర్షన్ కు ఇప్పుడు తెలుగు మూవీ లవర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ మూవీ ఎలాంటి సందడి లేకుండానే ఓటీటీలోకి అడుగు పెట్టింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు