Indra Ganti Mohan Krishna: ఆ ప్రొడ్యూసర్ తో హ్యాట్రిక్ కాంబినేషన్

ప్రతి దర్శకుడు కి ఒక్కో శైలి ఉంటుంది. ఒకరు చేసిన విధంగా మరొకరు సినిమాలు చేయలేరు. ఎవరి స్టైల్ వారిది ఎవరి పంథా వారిది. అలా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చూసుకుంటే ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఒక రకమైన ఫిలిం మేకర్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కలిసి చూసేలా డిఫరెంట్ కాన్సెప్ట్ ని తెరకెక్కించడం ఇంద్రగంటి మోహన్ కృష్ణ స్టైల్.

ఇప్పటివరకు ఇంద్రగంటి మోహన్ కృష్ణ చేసిన సినిమాలన్నీ ఎక్కువ శాతం పుస్తకాలనుండి ప్రేరణ పొందినవే. ఇంద్రగంటి మోహన్ కృష్ణ సినిమాలు కూడా ఒక మంచి పుస్తకం చదివిన అనుభూతిని కలిగిస్తాయి అనడంలో సందేహం లేదు. తీసినవి కొన్ని సినిమాలు అయినా వాటిలో చాలామందికి ఎక్కువ శాతం ఫేవరెట్ ఫిలిమ్స్ ఉంటాయి. ఎందుకంటే మోహన్ కృష్ణ రైటింగ్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పొచ్చు.

గ్రహణం సినిమాతో దర్శకుడుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు ఇంద్రగంటి మోహన్ కృష్ణ. ఆ తర్వాత మాయాబజార్ అనే సినిమాను చేశారు. ఆ తర్వాత చేసిన అష్టాచమ్మా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతోనే నాని యాక్టర్ గా పరిచయమయ్యాడు. నేడు నాని పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పటికీ ఇంద్రగంటి మోహన్ కృష్ణతో నానికి అదే రిలేషన్షిప్ ఉంటుంది.

- Advertisement -

అష్ట చమ్మా తర్వాత సినిమా గోల్కొండ హై స్కూల్. ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుమంత్ కెరియర్ లో ఉన్న అతి తక్కువ హిట్ సినిమాలలో ఈ గోల్కొండ హై స్కూల్ కూడా ఉంటుంది. ఒక పుస్తకం నుంచి ప్రేరణగా తీసుకొని తీసిన ఈ సినిమా అద్భుతమైన ఆదరణను తెలుగు ప్రేక్షకులు నుండి పొందింది.

ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి అభిరుచి ఉన్న నిర్మాత శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణ ప్రసాద్. ఇదివరకే వీరి కాంబినేషన్లో రెండు సినిమాలు వచ్చాయి. నాని హీరోగా నటించిన జెంటిల్మెన్ సినిమాకి శివలెంక కృష్ణ ప్రసాద్ గారు నిర్మాతగా వ్యవహరించారు. ఆ తర్వాత మళ్లీ సుధీర్ బాబు నటించిన సమ్మోహనం సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు శివలెంక కృష్ణ ప్రసాద్. ఇక ప్రస్తుతం వీరిద్దరూ కలిసి మరోసారి జతకట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించే తదుపరి సినిమాకు శివలెంక కృష్ణ ప్రసాద్ గారు మళ్లీ ప్రొడ్యూస్ చేయనున్నారు. అందరికంటే మోహన్ కృష్ణ లాస్ట్ ఫిలిం “ఒక్క అమ్మాయి తప్ప” ఈ సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు.

రీసెంట్ గా సమంత లీడ్ రోల్ లో నటించి మంచి హిట్ అందుకున్న సినిమా యశోద. ఈ సినిమాను శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఆ తర్వాత ప్రముఖ క్రికెటర్ ముత్తాయి మురళీదరన్ బయోపిక్ ని కూడా నిర్మించింది ఈయనే. ఆదిత్య 369 లాంటి అద్భుతమైన సినిమా ను అప్పట్లోనే ప్రొడ్యూస్ చేసిన ఘనత ఈయనది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood newsMovie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు