Thantra Movie Trailer Talk : క్షుద్రపూజల నేపథ్యంలో మరో రియలిస్టిక్ హర్రర్..

టాలీవుడ్ లో ఈ మధ్య హారర్ మూవీస్ ఊపందుకున్నాయి. మొన్నటివరకూ కామెడీ హారర్ నేపథ్యంలో ఎక్కువ సినిమాలు వచ్చినా, ఇప్పుడు పూర్తిస్థాయి హారర్ మూవీస్ రూపొందుతున్నాయి. ఇక లాస్ట్ ఇయర్ వచ్చిన పొలిమెర 2 బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అయింది. చేతబడుల నేపథ్యంలో వచ్చిన ఆ సినిమా థియేటర్ల దగ్గర ప్రేక్షకుల్ని భయపెట్టింది. ఇప్పుడు అలాంటి చేతబడులు, క్షుద్ర పూజల నేపథ్యంలో తెరకెక్కిన మరో చిత్రం కూడా రిలీజ్ కి రెడీ అయింది. టాలీవుడ్ టాలెంటెడ్ బ్యూటి అనన్య నాగళ్ళ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం “తంత్ర”. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అవగా సోషల్ మీడియా లో మంచి రెస్పాన్స్ తెచుకుంటుంది.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ఒక చిన్న ఊరిలో ఏదో లాభాన్ని ఆశించి క్షుద్ర పూజలు చేసే కొందరు, ఆ ఊళ్లలో కొందర్ని తమ తాంత్రిక విద్యతో వశపరుచుకొని ఎలా క్షుద్ర దేవతల్ని వశపరచుకున్నారు. అసలు ఆ ఊళ్ళో ఈ తాంత్రికులు ఎక్కడినుండి వచ్చారు. ఎందుకు ఈ పూజలు చేస్తున్నారనేది కథ నేపథ్యం. ఇక ఈ క్రమంలోనే హీరో, హీరోయిన్లు కూడా ఈ తాంత్రిక పూజల్లో భాగం అవ్వాల్సి వస్తుంది. ఇక ఆ తర్వాత జరిగిందేమిటన్నది థియేటర్లలో చూడాలి. ఇక ఈ ట్రైలర్ లో క్షుద్ర పూజల్ని పురాణాలకు లింక్ చేసి చెప్పడంతో కాస్త ఇంట్రస్టింగ్ గా అనిపించింది. డైలాగ్స్ కూడా బాగున్నాయి. అంతే కాకుండా ట్రైలర్ లో రకరకాల తాంత్రిక పూజలని చూపిస్తూ బాగా ఇంట్రస్టింగ్ గా మలిచారు.

- Advertisement -

అయితే ట్రైలర్ ని బట్టి చూస్తుంటే ఈ సినిమాలో మన పురాతన తాంత్రిక రహస్యాలని వెలికితీస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అనన్య దుష్టశక్తి బారిన పడిన అమ్మాయిగా కనిపిస్తోంది. ఇక క్షుద్రపూజలు చేసే తాంత్రికుడిగా ‘టెంపర్ వంశీ’ లుక్ బాగా సెట్ అయ్యింది. సలోని పాత్ర కూడా మిస్టీరియస్‌గా కనపడుతోంది. ఈ తంత్ర మూవీ తో శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుష్ రఘుముద్రి ఈ మూవీతో హీరోగా పరిచయమవుతున్నాడు. సలోని ఈ సినిమాతో గట్టిగా రీ-ఎంట్రీ ఇస్తోందని అర్ధమౌతోంది. రీసెంట్‌గా మంగళవారం సినిమాతో ఆకట్టుకున్న మీసాల లక్ష్మణ్ ఈ సినిమాలో ఒక మంచి రోల్ చేసాడని తెలుస్తోంది. ఇక తంత్ర మూవీ ని ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్ బ్యానర్స్ కలిసి రూపొందించిన ఈ సినిమా తో శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకుడిగా డెబ్యూ ఇస్తున్నాడు. ఇక మార్చి 15 న థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు