Thangalaan : ముందు ఎలక్షన్స్ తరువాత సినిమా

చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం తంగళన్. తంగళన్ చిత్రంలో విక్రమ్ మరోసారి అద్భుతంగా నటించబోతున్నాడు అని ఇదివరకే రిలీజ్ అయిన టీజర్ చూస్తే చాలామంది ప్రేక్షకులకు ఒక క్లారిటీ వచ్చింది. దర్శకుడు పా రంజిత్ విక్రమ్ చిత్ర తంగలన్ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. విక్రమ్ ‘తంగళన్’ చిత్రానికి డిఫరెంట్ మ్యూజిక్ ఇస్తున్నట్లు జివి ప్రకాష్ కుమార్ గతంలో చెప్పుకొచ్చారు.

దర్శకుడు పా రంజిత్ కబాలి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ సినిమా తరువాత వచ్చిన కాలా సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. థియేటర్ వద్ద ఈ సినిమాలు కమర్షియల్ గా హిట్ కాకపోయినా, కొన్ని వర్గాల ప్రేక్షకులు నుంచి మంచి ప్రశంసలు లభించాయి. ఆ తరువాత ఓటిటి లో రిలీజైన సర్పట్ట పరంపర సినిమా కూడా ఓ మేరకు ఆకట్టుకుంది. ప్రస్తుతం రంజిత్ చేస్తున్న తంగళన్.

విక్రమ్ నటించిన తంగలన్ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. విక్రమ్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘తంగళన్‌’ సినిమా భారీ బడ్జెట్‌తో ఉంటుందని నిర్మాత జ్ఞానవేల్‌ రాజా ప్రకటించారు. దర్శకుడు పా రంజిత్ కొత్త సినిమా నేపథ్యం కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అని గతంలో వార్తలు వచ్చాయి. 19వ శతాబ్దంలో బ్రిటీష్ కాలంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ‘తంగళన్’ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం.

- Advertisement -

మాళవిక మోహనన్ మరియు పార్వతి తిరువోత్ ఈ చిత్రంలో కథానాయికలుగా కనిపించనున్నారు. పశుపతి, హరి కృష్ణన్, అన్పు దురై వంటి నటులు కూడా విక్రమ్ నటించిన ‘తంగళన్’ చిత్రంలో కీలక పాత్రాలు పోషిస్తున్నారు. ఎ కిషోర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ఈ తంగళన్ సినిమాను తమిళనాడు ఎలక్షన్స్ తరువాత జూన్ 14 న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు