Venky75: వెంకీ సినిమా అప్డేట్ చెప్పిన జెర్సీ హీరోయిన్

విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “సైంధవ్”. హిట్, హిట్ 2 చిత్రాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. “నిహారిక ఎంటర్టైన్మెంట్స్” బ్యానర్ లో వెంకట్ బోయినపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఏప్రిల్ లో హైదరాబాద్ లో స్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్ అక్కడే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ సినిమా రెండో షెడ్యూల్ వైజాగ్ లో స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. అక్కడ ప్రధాన తారాగణం పై పలు సీన్ల చిత్రీకరణ జరిపారు.

వైజాగ్ షెడ్యూల్ లో హీరో వెంకటేష్ తో పాటు శ్రద్ధ శ్రీనాథ్, నవాజుద్దీన్ సిద్ధికి, ఆండ్రియా తదితరులు షూటింగ్ లో పాల్గొన్నారు. దాదాపు నెలరోజుల లాంగ్ షెడ్యూల్ జరిపిన చిత్ర బృందం, అక్కడ ఒక ఫైట్ సీన్ తో పాటు పలు కీలక సన్నివేశాలను పూర్తిచేశారు. ఇక సైంధవ్ సినిమా రెండో షెడ్యూల్ సక్సెస్ ఫుల్ గా పూర్తయిందని శ్రద్దా శ్రీనాథ్ తన ఇంస్టాగ్రామ్ పేజీ ద్వారా తెలిపింది. ఇక ఈ సినిమాకి సంబంధించిన తదుపరి షెడ్యూల్ త్వరలోనే హైదరాబాద్ లో రామానాయుడు స్టూడియో లో జరుపనున్నారు.

ఇక సైంధవ్ సినిమా కి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధికి ప్రత్యేక పాత్రలో నటిస్తుండగా తెలుగులో ఆయనకిదే మొదటి సినిమా. ఇక వెంకటేష్ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సైంధవ్ ఆయనకు 75వ సినిమా కావడం విశేషం. ఇక ఈ సైంధవ్ ని పాన్ ఇండియా సినిమాగా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న రిలీజ్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు