ENE: రిలీజ్ అప్పుడు దిక్కులేదు గాని- రీ-రిలీజ్ హడావిడికి మాత్రం తక్కువలేదు

టాలీవుడ్ లో ఇటీవలనే మొదలైన సినిమాల రీ-రిలీజ్ ల ట్రెండ్ రోజు రోజుకు ప్రాధాన్యం సంతరించుకుంటుంది. గతంలో కేవలం స్టార్ హీరోల సినిమాలు మాత్రమే రీ-రిలీజ్ లకు నోచుకోగా ప్రస్తుతం హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ప్రేక్షకుల దృష్టిలో స్తానం ఏర్పరచుకున్న మంచి సినిమాలన్నిటికీ ఇప్పుడు ఈ అదృష్టం దక్కుతుంది.

అయితే ఈ లిస్ట్ లో మొదటగా మాట్లాడాల్సిన సినిమా ఆరెంజ్. రిలీజ్ అప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొని బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచిన ఈ సినిమా ఇటీవలనే రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజై, ప్రేక్షకుల నుంచి ఒక రేంజ్ రెస్పాన్స్ అందుకుంది. దాంతో సినిమాని ఫ్లాప్ గా భావించిన ప్రొడ్యూసర్ నాగబాబు, డైరెక్టర్ భాస్కర్ లకు ఈ రీ-రిలీజ్ తృప్తినిచ్చింది అని చెప్పొచ్చు.

ఇక ఇదే కోవలో రానున్న మరో సినిమా ఈనగరానికి ఏమైంది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రిలీజప్పుడు నెగిటివ్ రెస్పాన్స్ ను అందుకుంది. అందరు కొత్త వాళ్ళవ్వడం. మేకింగ్ స్టైల్ కూడా రొటీన్ కి బిన్నంగా ఉండటం మూలాన ఈ సినిమా అప్పటి ప్రేక్షకులకు ఎక్కలేదు. కానీ రోజులు మారి, కొత్త రకమైన సినిమాటిక్ ఎక్స్ పీరియెన్స్ ను కోరుకుంటున్న తరుణంలో ఈనగరానికి ఏమైంది సినిమా గొప్పతనం ప్రేక్షకులకు అర్థమైంది. ముఖ్యంగా యూత్ ఈ విషయాన్ని బాగా గుర్తించరని చెప్పొచ్చు. దాంతో సినిమా వచ్చి దాదాపు అయిదు సంవత్సరాలు అవుతున్న కూడా ఈ సినిమా చూడాలనే కోరిక ఆడియన్స్ లో తగ్గలేదని తెల్సుతోంది.

- Advertisement -

పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే సూపర్ హిట్ సినిమా అయిన తొలిప్రేమ ఈనెల 30 రీ-రిలీజ్ అవుతుండగా కూడా ఈనగరానికి ఏమైంది సినిమాకి మంచి బుకింగ్స్ జరుగుతున్నాయి, ఒకటి రెండు చోట్ల ఇప్పటికే హౌస్ ఫుల్ బోర్డు కూడా పెట్టేసారు. దాంతో ప్రొడ్యూసర్స్ , డైరెక్టర్లు సినిమా రిలీజ్ చేసినప్పుడు మాత్రం పట్టించుకోరు కానీ రీ-రిలీజ్ కు మాత్రం హడావిడి చేస్తారని మాట్లాడుకుంటున్నారట.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు