Nikhil : స్పై సినిమాకి అంత సీన్ లేదంట- అంత పైపైన మాటలే తప్ప లోపల ఏమి లేదు

పాన్ ఇండియా సినిమాల కోసం టాలీవుడ్ స్టార్ హీరోలంతా నానా కష్టాలు పడుతుంటే యంగ్ హీరో నిఖిల్ కు మాత్రం ఒకే ఒక్క సినిమాతో ఇండియా వైడ్ పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న నిఖిల్. ఈ వారం స్పై సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.

గతేడాది నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గతంలో వచ్చిన కార్తికేయ సినిమాకు సీక్వెల్. అయితే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అలాంటి మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ తో వీరిద్దరూ కలిసి కార్తికేయ2 సినిమా చేసారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సారథ్యంలో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ గా నిలిచి, నిఖిల్ ను పాన్ ఇండియా హీరోని చేసింది.

ప్రస్తుతం నిఖిల్ స్వయంభు, ది ఇండియా హౌస్ అనే రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. ఈ రెండు షూటింగ్ దశలో ఉండగా నిఖిల్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఆధారంగా చేసిన స్పై సినిమా రిలీజ్ రెడీగా ఉంది. అయితే ఈ సినిమాలో సుభాష్ చంద్రబోస్ డెత్ గురించి ఎవరికీ తెలియని నిజాలు ఇందులో పొందుపరిచాం ..అంటూ మూవీ టీం చెబుతున్న కూడా ఇన్సైడ్ టాక్ మాత్రం చాలా నెగిటివ్ గా వస్తోంది. ఈ సినిమా యూనిట్ కూడా ఆదిపురుష్ సినిమా టీం లాగా పైపైకి మాత్రమే ప్రగల్బాలు పలుకుతున్నారు తప్ప సినిమాకి అసలు అలాంటిది ఏమి లేదని అసలు పాన్ ఇండియా రేంజ్ సినిమానే కాదని సమాచారం అందుతోంది. దీనికి తోడు ఇటీవలనే రిలీజైన ట్రైలర్ కూడా ప్రేక్షకులను మెప్పించకపోయేసరికి సినిమాపై అనుమానాలు వెల్లువెత్తున్నాయి.

- Advertisement -

ఇక అసలే తెలుగులో ఈ స్పై కాన్సెప్ట్ కథలకి ఆదరణ అంతంత మాత్రమే అవడంతో సినిమాపై అందరిలో అపనమ్మకం ఏర్పడుతుంది. కార్తికేయ ముందు ఇటివంటి పరిస్థితే ఉండగా కానీ ఆ సినిమా రిలీజ్ తరువాత అందరి అంచనాలను తల కిందులు చేసి సూపర్ హిట్ గా నిలిచింది అయితే అదే మాదిరిగా ఈ సినిమా కూడా అలాంటి విజయాన్నే సాధిస్తుందో, లేక ఆపజయం మూటగట్టుకుంటుందో చూడాలంటే సినిమా రిలీజ్ దాకా ఆగాలి.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు