Varuntej: గాండీవధారుడిగా ఆరోజే వస్తున్నాడు..

మెగా హీరో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ తర్వాత స్పీడ్ పెంచాడు. వరుసగా తన సినిమాల షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఎఫ్3 తర్వాత మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాని వరుణ్ తేజ్ ఈ సారి రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం అవుతున్నాడు. అందులో ఒకటి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో నటిస్తున్న గాండీవధారి అర్జున కాగా మరొకటి కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న (VT13)సినిమా.

అయితే తాజా సమాచారం ప్రకారం వరుణ్ తేజ్ నటిస్తున్న గాండీవధారి అర్జున సినిమా రిలీజ్ డేట్ ని అఫిషియల్ గా ప్రకటించడం జరిగింది. వరుణ్ తేజ్ అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా చేస్తుండంగా, పలువురు హాలీవుడ్ నటులు కూడా ఈ సినిమాలో ముఖ్య భూమికను పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు 80 శాతం పూర్తయిపోగా మిగిలిన పార్ట్ ని కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తారని చిత్ర యూనిట్ సమాచారం ఇచ్చింది. ఈ సినిమా ద్వారా ఎలాగైనా భారీ హిట్ కొట్టి కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు వరుణ్ తేజ్.

ఇక గాండీవధారి అర్జున సినిమాను వరల్డ్ వైడ్ గా ఆగష్టు25న విడుదల చేయనున్టట్టు చిత్ర యూనిట్ ఇంతకు ముందే ప్రకటించడం జరిగింది. అయితే ఈ సినిమా వాయిదా పడిందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. పైగా వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ వల్ల నటిస్తున్న సినిమాల షూటింగ్ జరగట్లేదని, అందువల్ల వాయిదా పడిందని సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. ఈ అనుమానాలన్నింటికీ తెర దించుతూ చిత్ర యూనిట్ ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసింది.

- Advertisement -

ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర పతాకం పై భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తుండగా, ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా యొక్క టీజర్ జులై రెండో వారంలో విడుదల చేసే అవకాశం ఉంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు