Ustaad Movie: వరుసగా నాలుగో దెబ్బ.. శ్రీ సింహలో మార్పు రావాలా?

Ustad Movie

టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీ గా ఉన్న చిన్న హీరో ఎవరంటే శ్రీ సింహ అని అందరు అనేవారు. చిన్న హీరోల్లో టాలెంట్ ఉన్న నటుడు శ్రీ సింహ. కెరీర్ మొదట్నుంచి హీరోయిజం జోలికి పోకుండా మంచి స్క్రిప్టులు సెలెక్ట్ చేసుకుంటూ సినిమాలు చేస్తున్నారు. మత్తు వదలరా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శ్రీ సింహ మొదటి సినిమాతోనే డీసెంట్ హిట్ కొట్టి అందరి దృష్టిలో పడ్డాడు.

ఇక ఆ తర్వాత తెల్లవారితే గురువారం సినిమాతో పలకరించాడు. అయితే ఆ సినిమా అంతగా ఆడలేదు. కానీ మంచి టాక్ తెచ్చుకుంది. అయితే లాక్ డౌన్ తరువాత వచ్చిన సినిమాలు మాత్రం ఏ ఒక్కటి ప్రభావం చూపలేకపోయాయి. దొంగలున్నారు జాగ్రత్త, భాగ్ సాలె, లేటెస్ట్ గా ఉస్తాద్ సినిమాతో ప్లాప్ లు అందుకున్నాడు శ్రీ సింహ.

అయితే ఈ సినిమాలు మరీ కొత్త కాన్సెప్ట్ సినిమాలు కాకపోయినా, కామెడీ బాగుంటుంది. మరి తేడా ఎక్కడ తేడా కొట్టిందో తెలియదు గాని, అన్నీ ప్లాప్ అయ్యాయి. దీనికి ప్రధానం కారణం మార్కెటింగ్ చెయ్యకపోవడం ఒకటి అయితే, మరొకటి స్క్రిప్ట్ సెలెక్షన్స్ లో మార్పు.

- Advertisement -

ఈ హీరో స్క్రిప్ట్ లు బాగానే ఉన్నప్పటికీ, డైరెక్షన్ మాత్రం కాస్త రొటీన్ గా ఉంటాయి. అయితే సినిమా లో తన పెరఫార్మన్స్ మాత్రం బాగానే ఉంటుంది. అందుకే శ్రీ సింహా కొంచెం గ్యాప్ తీసుకుని మంచి స్క్రిప్ట్ లు సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. దాంతో పాటు తన సినిమాలు కూడా సరైన సమయంలో రిలీజ్ అవుతున్నాయా లేదా అనేది చూడాలి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు