Director Trivikram: శ్రీలీలలో ఉన్న లోపాన్ని బయటపెట్టిన మాటల మాంత్రికుడు

Director Trivikram

టాలీవుడ్ లో తెరకెక్కతున్న బడా మూవీస్ లో “గుంటూరు కారం” ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. హ్యాట్రిక్ కాంబినేషన్ లో సినిమా వస్తుండడం వల్ల మహేష్ ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ లోను గుంటూరు కారం పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తుండగా, ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే గుంటూరు కారంలో శ్రీ లీలని త్రివిక్రమ్ తన మార్క్ లో చూపించబోతున్నాడని టాక్ నడుస్తుంది.

అదేంటంటే త్రివిక్రమ్ తీసిన చాలా సినిమాల్లో హీరోయిన్లను ఏదో ఒక లోపంతో చూపించాడు. జల్సా లో ఇలియానా కళ్ళ సైట్ ఉన్నట్టు చూపించగా, ఖలేజా లో అనుష్క ని ఐరన్ లెగ్ గా, సన్ అఫ్ సత్యమూర్తితో సమంతని షుగర్ పేషేంట్ గా, అఆ లో మళ్ళీ సమంత ని తెలివి తక్కువ అమ్మాయిలా చూపించాడు.

- Advertisement -

ఇవే కాకుండా తాను డైరెక్ట్ చేసిన వేరే సినిమాల్లో హీరోయిన్లను ఏదో ఒక లోపంతో గురూజీ చూపించడం జరిగింది. దానివల్ల సినిమాల్లో మంచి ఫన్ జెనరేట్ అయ్యింది. ఇప్పుడు గుంటూరు కారంలో శ్రీలీల ని కూడా త్రివిక్రమ్ అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఇక శ్రీ లీలని గుంటూరు కారంలో మతి మరుపు ఉన్న అమ్మాయిగా చూపిస్తున్నాడని అంటున్నారు నెటిజన్లు. మరి ఇది నిజమోకాదో సినిమా వస్తే గాని తెలియదు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు