Manushi Chiller Telugu Movie: తెలుగులో ఫస్ట్ మూవీ చేస్తున్న మిస్ వరల్డ్ బ్యూటీ

Manushi Chillar Telugu Movie

టాలీవుడ్ లో ప్రతి సంవత్సరం కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడం కామనే. అలాగే అందులో డైరెక్ట్ గా తెలుగు సినిమాతోనే ఫిల్మ్ కెరీర్ స్టార్ట్ చేసే వారు కొందరుంటారు. మరికొందరు వేరే భాషల్లో ఆల్రెడీ చేస్తూ, తెలుగులో కూడా ఫేమ్ సంపాదించుకోవాలని కొందరు ఎంట్రీ ఇస్తారు. ఈ రెండో కోవలోకి మరో హీరోయిన్ చేరబోతోంది.

ఆమె ఎవరో కాదు 2017 లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న మానుషీ చిల్లర్. హర్యానా కి చెందిన ఈ భామ మోడలింగ్ చేస్తూ సినిమాల్లోకి ప్రవేశించింది. గత ఏడాది బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన పృథ్వీ రాజ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ హీరోయిన్ కి మొదటి సినిమాయే ప్లాప్ గా నిలిచింది.

అయినా మిస్ వరల్డ్ ఫేమ్ తో వరుస ఆఫర్లు దక్కించుకుంటుంది ఈ భామ. అలా మూడు సినిమాల్లో నటిస్తుండగా, ఇప్పుడు తెలుగులోను ఎంట్రీ ఇస్తుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “ఆపరేషన్ వాలంటైన్”.

- Advertisement -

శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా లో హీరోయిన్ గా మానుషీ చిల్లర్ నటిస్తుందని చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేసింది. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా భారత నేవి ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కుతుంది. డిసెంబర్ 8న ఈ సినిమా రిలీజ్ అవుతుంది.

ఇక టాలీవుడ్ ఎంతో మందికి స్టార్ హీరోయిన్లుగా మార్చింది. మరి ఈ భామకు కూడా టాలీవుడ్ లోనే లక్ రాసిపెట్టి ఉందేమో అని అనిపిస్తుంది. ఆపరేషన్ వాలంటైన్ హిట్ అయితే మానుషీ చిల్లర్ తెలుగులో వరుస ఆఫర్లు అందుకునే అవకాశం పుష్కలంగా ఉంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు