Actress Tamanna: చరణ్ తో మరోసారి పని చేయాలి అంటున్న ఆ హీరోయిన్

Actress Tamanna

మిల్కీ బ్యూటీ తమన్నాకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీ అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమంలోకి అడుగుపెట్టిన మిల్కీ బ్యూటీ తమన్న… హ్యాపీడేస్ సినిమా తర్వాత బాగా పాపులర్ అయింది మిల్కీ బ్యూటీ తమన్న భాటియా. తెలుగు, తమిళ్ అనే తేడా లేకుండా అన్ని భాషలలో సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది తమన్నా.

మంచు మనోజ్ తో కలిపి ‘శ్రీ’ అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ పరిశ్రమలోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తి కావస్తున్నాయి. అయినా ఈమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కుర్ర హీరోయిన్లతో పోటీ పడుతూ వరుస సినిమాలు చేస్తుంది.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా మాట్లాడుతూ… ‘నాకు ఇండస్ట్రీలో క్లోజ్ అంటే కాజల్ అగర్వాల్. ఇద్దరం ముంబైలో తరచూ కలుస్తుంటాం. కాజల్ కు జనరల్ నాలెడ్జ్ ఎక్కువ. ఏ విషయం పైనైనా గలగల మాట్లాడేస్తుంది.

- Advertisement -

ఆమెతో ఎంతసేపు మాట్లాడిన మాట్లాడాలనిపిస్తుంది. కానీ ఎప్పుడైనా ఒత్తిడికి గురైతే మాత్రం ఎంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నా ఎవరికి ఫోన్ చేయను రామ్ చరణ్ కు తప్ప. అతను బిజీగా ఉన్నా నా కాల్ లిఫ్ట్ చేస్తాడు. చరణ్ తో మాట్లాడుతుంటే అసలు టైం తెలియదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా చెర్రీతో మాట్లాడితే మనసు కుదుటపడుతుంది’ అంటూ చెప్పుకొచ్చింది తమన్నా. ప్రస్తుతం తమన్నా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు