Vijay Devarakonda Comments: రష్మిక కంటే నాకు సమంత ఎక్కువ ?

Vijay Devarakonda Comments

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన పాటలు, ట్రైలర్ మెప్పిస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుండగా మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు.

కాగా ఖుషి సినిమా సెప్టెంబర్ 1న పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా విలేకరుల సమావేశానికి హాజరైన విజయ్ దేవరకొండను ‘మీ క్రష్ ఎవరు?’ అని ప్రశ్నించగా… ‘సమంత రూత్ ప్రభు నా క్రష్’ అని చెప్పాడు.

ఒక్కసారిగా ఈ న్యూస్ వైరల్ అయిపోయింది. రష్మిక పేరు కాకుండా విజయ్ మరో నటి పేరు చెప్పడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. కాగా… మురళీ శర్మ, సచిన్ కేడేకర్, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 1న విడుదలకానుంది.

- Advertisement -

దీంతో ఖుషి చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఆడియో లాంచ్ పేరుతో మ్యూజికల్ కాన్సర్ట్ ని నిర్వహిస్తున్నారు. ఖుషి సినిమా సాంగ్స్ ని లైవ్లో పెర్ఫార్మ్ చేయబోతున్నారు. అలాగే విడుదల కానీ మరో రెండు పాటలని కూడా ఈ ఖుషి ఆడియో లాంచ్ లో రిలీజ్ చేస్తారని సమాచారం.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు