Varun tej: ఇండియన్ టాప్ గన్ మార్విక్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ,శక్తి ప్రతాప్ సింగ్ అనే బాలీవుడ్ కొత్త దర్శకుడితో ఒక సినిమా చేస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యం లో ఈ చిత్రం ఉండబోతుంది. వరుణ్ తేజ్ ఈ సినిమా లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా కనించబోతున్నారు. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ఈ చిత్రానికి సంబంధించి భారీ యాక్షన్ ఎపిసోడ్ ని ఇటీవలనే చిత్ర యూనిట్ కంప్లిట్ చేసినట్టు ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు.

ఇండియన్ ఎయిర్ఫోర్స్ లోని వాస్తవా సంఘటనల ఆధారంగా ఈ చిత్రం ఉండొబోతుంది. ఈ చిత్రానికి సంబంధించి గతంలో ఒక పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే పోస్టర్ చూడటానికి హాలీవుడ్ “టాప్ గన్ మార్విక్ “ని తలపిస్తోంది. అల్ ది బెస్ట్ టూ ది టీం అంటూ పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమాని వీలైనంత తొందరగా ఫినిష్ చేసి రిలీస్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

వరుణ్ తేజ్ ఇప్పటికే ఆయన ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో “గాండీవధారి అర్జున” అనే ఒక యాక్షన్ సినిమా చేస్తున్నారు. అయితే ఈ మూవీ షూట్ దశలో ఉండగానే వరుణ్ తేజ్ VT13ని కమిట్ అయ్యారు. “గని” సినిమా నిరాశపరచడం, F3 మూవీ పేరుకి హిట్టయిన వరుణ్ తేజ్ కెరీర్ కి ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అందుకే ఆయన ప్రస్తుతం తన యాక్టింగ్ పొటెన్షియల్ ప్రూవ్ చేసుకునేలా వరుస సినిమాలు చేస్తున్నారు. VT13 ని  సోనీ పిక్చ‌ర్స్‌, ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్ష‌న్స్‌, రిసైనెన్స్ పిక్చ‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు

- Advertisement -

 

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు