Ravi Teja: ప్రకంపనలు రేపుతున్న రావణాసుర లీక్డ్ డైలాగ్..!

మాస్ మహారాజ రవితేజ హీరోగా సుధీర్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన రావణాసుర సినిమా ఏప్రిల్ 7న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఘాటైన డైలాగ్స్ తో వైలెంట్ గా తీసినందుకు గాను సెన్సార్ A సర్టిఫికెట్ కూడా ఇచ్చింది. అయితే ఈ సినిమాలోని డైలాగ్స్ ఏ లెవెల్లో ఉన్నాయో తాజాగా లీకైన వీడియో చుస్తే అర్థమవుతుంది. డైరెక్టర్ సుధీర్ వర్మ ఇందులోని హింస మరియు డైలాగులు టోరంటినో సినిమాల తరహాలో ఉండబోతున్నాయంటూ ముందే హింట్ ఇచ్చినప్పటికీ లీకైన డైలాగ్ వీడియో మాత్రం అరాచకంగా అనిపిస్తుంది. రవితేజ సినిమాలంటే ఇన్నాళ్లు కామెడీతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండటం చూస్తూ వచ్చాం. లీకైన వీడియో చూస్తుంటే రావణాసుర సినిమా అందుకు పూర్తి భిన్నంగా ఉన్నట్టు అనిపిస్తుంది.

లీకైన వీడియోలో ఉన్న డైలాగ్ మహిళలను కించపరిచేలా ఉందంటూ ఓ వర్గం అప్పుడే సోషల్ మీడియా వేదికగా గగ్గోలు పెడుతోంది. ఈ సినిమాలో పూర్తి నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించిన రవితేజ ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాతో రావటం ఇదే తొలిసారి. అంతే కాక ఈ సినిమాలో ఆరుగురు హీరోయిన్లు ఉండటం మరో విశేషం. ఈ సినిమాకు ముందు రవితేజ ధమాకా, వాల్తేరు వీరయ్య వంటి వరుస హిట్స్ కొట్టటంతో రావణాసుర పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు ప్రమోషన్స్ లో ప్రొఫైల్ లో చేసిన కారణంగా అనుకున్నంత స్థాయిలో బిజినెస్ జరగలేదు. రవితేజ నెగిటివ్ షేడ్ లో కనిపించటం, సుధీర్ వర్మకు ఇంతకుముందు చెప్పుకోదగ్గ హిట్ లేకపోవటం కారణంగా కావాలనే సినిమా యూనిట్ ప్రమోషన్స్ హై లెవెల్లో చేయలేదని తెలుస్తోంది. ఉదృతంగా ప్రమోషన్స్ చేసి అంచనాలు పెంచేకంటే సినిమా జనాల్లోకి వెళ్ళాక నచ్చితే మౌత్ పబ్లిసిటీ ద్వారా పుంజుకుంటుంది అన్న భావనలో ఉన్నట్టున్నారు మేకర్స్. ఏదేమైనా రవితేజ సినిమాల శైలికి భిన్నంగా రూపొందిన ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని ఆశిద్దాం.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు