Trivikram: “ఓజి” విషయంలోనూ ఆయనే కారణమా?

Fans trolling Trivikram even for OG?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో అన్నిటికంటే ఎక్కువ హైప్ ఉన్న సినిమా “ఓజి”. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు పీకే ఫ్యాన్స్. అసలు ఈ టైటిల్ అనౌన్స్ మెంట్ అయినప్పటినుండే సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో రచ్చ చేసారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తున్నారు. ఇప్పటికే 40శాతం షూటింగ్ పూర్తయిన ఈ సినిమాలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ, కోలీవుడ్ విలక్షణ నటుడు అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి తదితరులు నటిస్తున్నారు.

అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన బ్రో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా మెప్పించలేక పోయిందన్న సంగతి తెలిసిందే. అయితే దీనికి కారణం త్రివిక్రమ్ స్క్రిప్ట్ లో వేలు పెట్టడమే అని ఫ్యాన్స్ అంటున్న మాట. అజ్ఞాత వాసి టైం నుండి త్రివిక్రమ్ పై పవన్ ఫ్యాన్స్ కోపంగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. భీమ్లా నాయక్ సినిమాకి త్రివిక్రమ్ మార్క్ సాంగ్స్, డైలాగ్స్ ప్లస్ అయినా, బ్రో సినిమాలో త్రివిక్రమ్ డైలాగ్స్ పెద్దగా కనిపించలేదన్నది వాస్తవం. అందుకే స్క్రిప్ట్ లో త్రివిక్రమ్ లేకపోతే సినిమా ఇంకా డీసెంట్ గా ఉండేదని పవన్ ఫ్యాన్స్ అభిప్రాయం.

ఇక ఇప్పుడు ఓజి కి కూడా త్రివిక్రమ్ ని లింక్ పెట్టి ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆంటీ ఫ్యాన్స్. అసలు విషయానికి వస్తే ఓజి సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి మొదట అనిరుధ్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకుందామని మేకర్స్ భావించారట. కానీ ఇందులో కూడా త్రివిక్రమ్ కలగజేసుకుని అనిరుధ్ ని కాన్సల్ చేసి థమన్ ని భర్తీ చేశారని టాక్ నడుస్తుంది. దీన్ని నమ్మిన కొందరు ఫ్యాన్స్ త్రివిక్రమ్ ని తమ హీరో సినిమాల్లో వేలు పెట్టొద్దని ట్రోల్ చేస్తున్నారు.

- Advertisement -

అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన తరఫునుండి అన్నీ దగ్గరుండి మూవీ పనులు చూస్తూన్న త్రివిక్రమ్ కూడా దూరమైతే ఎలక్షన్స్ టైం లో సినిమాకి సంబంధించి ప్రాబ్లం అవుతుందంటున్నారు కొందరు ఫ్యాన్స్. ఏది ఏమైనా త్రివిక్రమ్ కి ఓజి సినిమాకి సంబంధం లేదన్నది వాస్తవం.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు