Nithiin: నితిన్ దెబ్బకు ఆ స్టార్ హీరో దుకాణం బంద్.. ఎవరంటే..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ ను సృష్టించుకున్న నటుడుగా మంచి పాపులారిటీ సంపాదించారు హీరో నితిన్.. గతంలో వరుసగా విజయాలను అందుకున్న నితిన్ ఇటీవల కాలంలో తను నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇటీవలే తాను నటించిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో కచ్చితంగా విజయాన్ని అందుకుంటామని చిత్ర బృందం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నది. ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తూ ఉండగా డైరెక్టర్ వక్కంతం వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఇదంతా ఇలా ఉండగా తాజాగా నితిన్, పవన్ కళ్యాణ్ గురించి ఒక విషయం వైరల్ గా మారుతోంది.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ హీరోగా ప్రస్తుతం టాలీవుడ్ లో చలామణి అవుతున్నారు. చిరంజీవి తమ్ముడు గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్.. పవన్ కళ్యాణ్ నటుడుగా కాకుండా స్క్రీన్ ప్లే రైటర్ గా , కొరియోగ్రాఫర్ గా డైరెక్టర్ గా ఇలా ఎన్నో విభాగాలలో సైతం మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.

అయితే నిర్మాతగా మాత్రం పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. 2014 తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనే నిర్మాణ సంస్థ ను స్థాపించారట. ఈ బ్యానర్ మీద అప్పట్లో గబ్బర్ సింగ్ సినిమాని చేయాలనుకున్నారు. ఒకవేళ ఈ సినిమాని తెరకెక్కించి ఉంటే దాదాపుగా 70 కోట్ల రూపాయల వరకు లాభం వచ్చేదని చెప్పవచ్చు.. కానీ తనని నమ్మి సినిమా తీసిన బండ్ల గణేష్ కి.. తీన్మార్ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో గబ్బర్ సింగ్ సినిమాని అతని బ్యానర్ పైనే తెరకెక్కించారు.

- Advertisement -

ఆ తర్వాత కొన్నాళ్లకు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్ బ్యానర్ పైన సర్దార్ గబ్బర్ సింగ్ మరియు కాటంరాయుడు సినిమాలను తెరకెక్కించారు ఈ రెండు సినిమాలు కూడా ఘోరమైన డిజాస్టర్లుగా మిగిలాయి దీనివల్ల ఆర్థిక నష్టాలు కూడా మిగిలాయట.అలాగే నితిన్ నటించిన చల్ మోహన్ రంగ సినిమాకి కూడా పవన్ కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరించగా దాదాపుగా 20 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించగా ఈ సినిమా ఫ్లాప్ అవడంతో రూ.20 కోట్లు నష్టం వచ్చినట్లు సమాచారం. దీంతో ఈ సినిమా దెబ్బకి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ మీద సినిమాలను తెరకెక్కించడమే మానేశారని సమాచారం.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు