Pushpa The Rule : పుష్ప గాడి యూట్యూబ్ ఎంట్రీ తో ఈ రికార్డులు బ్రేక్ అవుతాయా?

Pushpa The Rule : టాలీవుడ్ లో తెరకెక్కుతున్నా మోస్ట్ అవైటెడ్ కేజ్రీ సినిమాల్లో పుష్ప ది రూల్ కూడా ఒకటి. ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ మాత్రమే కాదు కామన్ ఆనాడైన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా హిందీ ప్రేక్షకులు సౌత్ నుండి అన్నిటికంటే ఈ సినిమా కోసమే ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే మూడేళ్ళ కింద పుష్ప గాడు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటింది మరి. సైలెంట్ గా వచ్చి బాలీవుడ్ లో వైలెంట్ గా బాక్స్ ఆఫీస్ వద్ద రచ్చ చేసాడు. సుకుమార్ మార్క్ స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో అల్లు అర్జున్ మాస్ అప్పీరెన్స్ తో ప్రేక్షకుల్ని ఫిదా చేసారు. అన్నిటికి మించి ఈ సినిమా పాటలతో డిఎస్పీ రచ్చ చేసాడని చెప్పాలి. ఇక రెండో పార్ట్ పై అంతకు మించి అంచనాలు పెంచేసింది. ఇక రెండో పార్ట్ మొదలుపెట్టడానికే ఏడాది సమయం తీసుకున్న సుకుమార్, స్టార్ట్ చేసాక మాత్రం ఎక్కడా తగ్గకుండా జెట్ స్పీడ్ తో సినిమాని పూర్తి చేస్తున్నాడు. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు, రిలీజ్ చేసిన రెండు మూడు సాలిడ్ స్టిల్స్ తో ఇండియా వైడ్ గా ఓ రేంజ్ లో అంచనాలని పెంచేసాయి. ఫైనల్ గా ఇప్పుడు టీజర్ తో రచ్చ చేయడానికి రెడీ అయ్యారు.

పుష్ప గాడి టార్గెట్ ఇవే..

అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ గా ఏప్రిల్ 8న పుష్ప మేకర్స్ టీజర్ ని రిలీజ్ చేస్తున్నారు. ఇక పుష్ప ఫస్ట్ పార్ట్ పాన్ ఇండియా రేంజ్ లో భారీ సక్సెస్ గా నిలిచి బెస్ట్ యాక్టర్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఏకంగా నేషనల్ అవార్డును సైతం సొంతం అయ్యేలా చేసిన సినిమా. ఇప్పుడు ఆ రేంజ్ సక్సెస్ తర్వాత వస్తున్న రెండో పార్ట్ ఆగస్టు 15న రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ గా టీజర్ ను రిలీజ్ చేస్తున్నారు. ఇక ఇండియాలో ఈ ఇయర్ వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ముందు నిలిచే పుష్ప2 ( Pushpa The Rule ) ఏ రేంజ్ లో ఉండబోతుందో చెప్పే టీజర్ ఏమాత్రం అంచనాలను అందుకున్నా సినిమా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల జాతర సృష్టించవచ్చు. నేషనల్ వైడ్ గా 1000 కోట్ల టార్గెట్ లక్ష్యంగా వస్తున్న ఈ సినిమా అఫీషియల్ టీజర్ యూట్యూబ్ లో బ్రేక్ చేయాల్సిన రికార్డులు కొన్ని ఉన్నాయి. ఈ రికార్డులపై అందరికంటే ఎక్కువగా ఫ్యాన్స్ ఫోకస్ ఉంటుందని తెలిసిందే. ఇక అందులో టాలీవుడ్ వరకు చూసుకుంటే ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ రికార్డ్ RRR మూవీ యొక్క ఎన్టీఆర్ ఇంట్రో టీజర్ పేరిట 7 నిమిషాలతో ఉంది. ఈ రికార్డ్ ను పుష్ప2 టీజర్ బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి. అలాగే 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ ని సాధించిన టాలీవుడ్ టీజర్ గా ప్రభాస్ నటించిన రాదే శ్యామ్ టీజర్ 42.67M వ్యూస్ తో రికార్డ్ కొనసాగుతూ ఉంది. ఇక లైక్స్ పరంగా RRR మూవీలో ఎన్టీఆర్ ఇంట్రో టీజర్ 940.3K లైక్స్ తో టాప్ లో ఉంది.

పాన్ ఇండియా రికార్డులు..

ఇక టాలీవుడ్ నుండే కాకుండా పుష్ప ది రూల్ నేషనల్ వైడ్ గా పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అవుతుంది కాబట్టి టీజర్ కూడా నేషనల్ రేంజ్ లోనే రికార్డులు సృష్టించాలి అని ఫ్యాన్స్ అనుకుంటారు. ఇక పాన్ ఇండియా వైడ్ గా పుష్ప ది రూల్, సింగిల్ ఛానెల్ లో రిలీజ్ చేసిన టీజర్ ల పరంగా 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ ను సలార్ టీజర్ 83 మిలియన్స్ తో సొంతం చేసుకోగా, ఈ రికార్డులని బ్రేక్ చేయాల్సిన పని పుష్ప కి ఉంది. ఇక లైక్స్ పరంగా కేజిఎఫ్ చాప్టర్2 ఎవరూ ఊహించని రేంజ్ లో 4.26 మిలియన్ లైక్స్ తో రికార్డ్ ను సెట్ చేసింది. మరి ఈ రికార్డులలో పుష్ప ది రూల్ టీజర్ ఎన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి. అయితే ట్రేడ్ విశ్లేషకుల లెక్కల ప్రకారం పుష్ప2 టీజర్ ఎన్ని రికార్డులు బ్రేక్ చేసినా కెజిఎఫ్ 2 టీజర్ సెట్ చేసిన లైక్స్ రికార్డులని అందుకోవాలంటే చాలా కష్టమని అంటున్నారు. కానీ పుష్ప మీద ఉన్న క్రేజ్ ఏదైనా మ్యాజిక్ చేయొచ్చు. మరి ఈ రికార్డుల గురించి లెక్కలు తేలాలంటే మరో రెండు రోజులు ఆగాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు