Ram Charan – NTR : ఈ స్టార్ హీరోలు అతన్ని ఫాలో అవుతున్నారా..?

Ram Charan – NTR : టాలీవుడ్ లో గ్లోబల్ స్టార్స్ గా పేరు పొందిన రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు ఫ్యాన్ ఫాలోయింగ్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది.. తాజాగా ఈ ఇద్దరు హీరోలు ఒక స్టార్ హీరోని ఫాలో అవుతున్నారనే వార్తలు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా ఆ స్టార్ హీరో ప్రణాళికలు చూసి ఆశ్చర్యపోయి.. ఆ స్టార్ హీరోని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో కాదు బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా పేరు సంపాదించిన ప్రభాస్.. రాధే శ్యామ్ సినిమా తర్వాత కొత్త ప్రాజెక్టుల విషయంలో అతని ప్లానింగ్ చాలా పక్కాగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా వాటిని కమిట్ అయిన విధానం , రిలీజ్ అవుతున్న విధానాన్ని బట్టే ఈ విషయాలను చెప్పవచ్చు.

ప్రభాసే ఆదర్శం..

రాధేశ్యామ్ సినిమా విడుదల తర్వాత ఏడాది గ్యాప్ లో ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదే ఏడాది చివరిలో సలార్ సీజ్ ఫైర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నారు. అలా రెండు సినిమాలు ఆరు నెలల గ్యాప్ లోనే విడుదల చేశారు ప్రభాస్.. 2024 జూన్ చివరివారం లేదా జూలై మొదటి వారంలో కల్కి సినిమాని రిలీజ్ చేయబోతున్నారు.. దీంతో సలార్ మూవీకి , కల్కి సినిమాకి మధ్య కేవలం ఐదు నెలల గ్యాప్ మాత్రమే కనిపిస్తోంది. అలాగే డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో నటిస్తున్న రాజా సాబ్ సినిమా సెట్స్ లో ఉండగానే సలార్ -2 సినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టబోతున్నారట.

ప్రభాస్ ని ఫాలో అవుతున్న చరణ్ – ఎన్టీఆర్..

ఇలా ఈ రెండు చిత్రాలను కూడా కేవలం వచ్చే ఏడాది ఆరు నెలల వ్యత్యాసంతోనే రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు ప్రభాస్.. డిసెంబర్ నుంచి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమాని మొదలు పెట్టబోతున్నారు.. అలా 2026 లో ఈ సినిమా విడుదల చేసేలా ప్లాన్ చేశారు. ఆ తర్వాత డైరెక్టర్ హనురాఘవపూడి డైరెక్షన్లో కూడా ఒక సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా పై ఇంకా అధికారికంగా క్లారిటీ రాలేదు. ఇప్పుడు ఇలాంటి స్ట్రాటజీనే ఎన్టీఆర్, రామ్ చరణ్ ( Ram Charan – NTR ) కూడా ఫాలో అవుతున్నట్లు సమాచారం..

- Advertisement -

రామ్ చరణ్ సినిమాలు..

RRR సినిమా సెట్స్ లో ఉండగానే గేమ్ ఛేంజర్ సినిమాకి కమిట్ అయ్యారు రామ్ చరణ్.. అయితే విడుదల తేదీ కాస్త డిలే అవుతున్నప్పటికీ తన ప్లాన్ లో మాత్రం ఎలాంటి లోపం లేదు.. సినిమా సెట్స్ మీద ఉండగానే డైరెక్టర్ బుచ్చిబాబుతో RC -16 సినిమాని చేస్తున్నారు.. ఈ సినిమా ప్రారంభమైన వెంటనే RC -17 సినిమాని డైరెక్టర్ సుకుమార్తో ప్లాన్ చేశారు.. ఇవన్నీ కూడా ఏడాది గ్యాప్ లేకుండానే రిలీజ్ చేస్తున్నారట రామ్ చరణ్.. రిలీజ్ విషయంలో కూడా ఇదే ప్లాన్ ని మెయింటైన్ చేస్తున్నారు..

ఎన్టీఆర్ సినిమాలు..

ఇక ఎన్టీఆర్ సినిమాకు వస్తే.. దేవర సినిమాని ఇదే వ్యత్యాసంతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.. అక్టోబర్లో దేవర మొదటి భాగం.. ఆ తర్వాత ఆరు నెలల గ్యాప్ లోనే వార్ -2.. అనంతరం కొన్ని నెలల వ్యవధిలోనే దేవర-2 చిత్రాన్ని కూడా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు ఎన్టీఆర్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు