Tillu Square Collections : టిల్లు గాడి క్రేజ్.. రూ.100 కోట్లకు మరెంత దూరం..!

Tillu Square Collections : గతంలో సూపర్ హిట్ అయిన డీజే టిల్లు సినిమాకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ చిత్రాన్ని తెరకెక్కించారు. మొదటి పార్ట్ లో సిద్దు జొన్నలగడ్డ నేహా శెట్టి జంటగా నటించి భారీ విజయాన్ని సొంతం చేసుకోగా.. రెండవ భాగంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించగా.. బీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించారు.. సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మించడం జరిగింది. ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద హడావిడి చేస్తూ భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది ఈ సినిమా.

రూ.100 కోట్ల బరిలో..

రూ.100 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన టిల్లూ గాడు.. క్లబ్లో చేరడానికి మరెంత దూరంలో ఉన్నాడో ఇప్పుడు చూద్దాం. మార్చి 29వ తేదీన విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి రోజే రూ.23 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది. అంతేకాదు నాలుగు రోజుల్లోనే రూ.85 కోట్లు రాబట్టిన ఈ సినిమా కేవలం 8 రోజుల్లోనే రూ.96.6 కోట్ల గ్రాస్ వసూలు చేసి రూ.100 కోట్ల క్లబ్ కు చేరువలో ఉంది. వారం రోజులుగా సూపర్ హిట్ టాక్ తో కొనసాగుతూ మరి రెండు రోజుల్లో ఈ సినిమా ఖచ్చితంగా రూ .100 కోట్ల క్లబ్లో చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తం 8 రోజుల్లోనే రూ.96 కోట్ల గ్రాస్ కలెక్షన్లు ( Tillu Square Collections ) రాబట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన టిల్లు స్క్వేర్ ఈరోజు లేదా రేపు కచ్చితంగా రూ .100 కోట్ల క్లబ్లో చేరడం ఖాయమని చెబుతున్నారు సినీ విశ్లేషకులు .మొత్తానికైతే కలెక్షన్లతో దూసుకుపోతూ భారీ లాభాల బాట పడుతున్నారు ఈ సినిమా నిర్మాతలు.

టిల్లు క్యూబ్..

డీజే టిల్లు , టిల్లు స్క్వేర్ సినిమాలు భారీ విజయాన్ని దక్కించుకోవడంతో త్వరలోనే టిల్లు క్యూబ్ కూడా రాబోతోందని చిత్ర బృందం ప్రకటించింది. మరి ఇందులో సిద్దుతో జోడి కట్టనున్న హీరోయిన్ ఎవరనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.. మొత్తానికైతే తన వరుస సినిమాల పరంపర కొనసాగిస్తున్నారు సిద్దు జొన్నలగడ్డ.

- Advertisement -

సిద్దు జొన్నలగడ్డ టాలెంట్..

సిద్దు జొన్నలగడ్డ హైదరాబాదులో పుట్టి పెరిగారు. బీటెక్ పూర్తి చేసిన తర్వాత సినిమాల్లో నటిస్తూనే ఎంబీఏ పూర్తి చేసారు.. ఈయన తల్లి 25 సంవత్సరాలు ఆల్ ఇండియా రేడియోలో పనిచేశారు. తల్లితో కలిసి సంగీత కార్యక్రమాలకు వెళ్లడం వల్ల సంగీతంపై ఆసక్తి కలిగింది. అలా నాలుగేళ్ల పాటు తబలా కూడా నేర్చుకున్నారు. ఇక ప్రభుదేవా స్ఫూర్తితో ఏకంగా ఐదేళ్లపాటు నృత్యంలో శిక్షణ తీసుకొని జోష్ , ఆరెంజ్, భీమిలి కబడ్డీ జట్టు వంటి చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషించి 2010లో మొదటిసారి లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ అనే సినిమాతో హీరోగా అవతారం ఎత్తారు. ఆ తర్వాత భాయ్ మీట్స్ గర్ల్, గుంటూరు టాకీస్, కల్కి, మా వింత గాధ వినుమా సినిమాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఇక 2022లో వచ్చిన డీజే టిల్లు తో ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోయిన సిద్దు జొన్నలగడ్డ ఇప్పుడు టిల్లు స్క్వేర్ తో కూడా అంతే పేరు సొంతం చేసుకున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు