Ramayanam : హిందీ “రామాయణం”కు సీత కష్టాలు… అటకెక్కినట్టేనా?

భారతం ఇతిహాస గాథ రామాయణాన్ని తెరకెక్కించడానికి బాలీవుడ్ మేకర్స్ పడుతున్న శ్రమ అంతా అంతా కాదు. రామాయణానికి సీత కష్టాలు అన్నట్టుగా ఈ మూవీని ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంది. ఇక ఇప్పుడు పరిస్థితి అసలు ఈ సినిమా ఉంటుందా? లేక అటకెక్కినట్టేనా? అనే అనుమానాన్ని కలిగిస్తోంది. మరి ఇంతకీ ఈ బాలీవుడ్ రామాయణానికి వచ్చిన కష్టాలు ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

స్టార్ట్ కాకముందే ఇన్ని కష్టాలా?
దంగల్ ఫేమ్ బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి చాలా రోజులుగా రామాయణం మూవీని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటిదాకా ఇండియన్ సినీ చరిత్ర కనీవిని ఎరగని విధంగా భారీ బడ్జెట్ తో ఈ మూవీ విజువల్ వండర్ గా రాబోతుందని ప్రచారం జరిగింది. ఇక ఇందులోని స్టార్ కాస్ట్ కళ్ళు చెదిరేలా ఉంటుందని సోషల్ మీడియాలో ముచ్చటించుకున్నారు. కానీ ఇప్పుడేమో పరిస్థితి చూస్తుంటే అసలు ఈ మూవీ తెరకెక్కుతుందా? ఇప్పట్లో అయ్యే పనేనా ? అనిపిస్తోంది. ముందుగా డైరెక్టర్ విషయానికొస్తే… నితీష్ తివారి చాలా రోజులుగా రామాయణం మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. మూడు పార్ట్స్ గా ఈ మూవీని ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఈ మూవీలో రణబీర్ కపూర్ రాముడిగా నటించబోతున్నాడని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మూవీలో సీతగా సాయి పల్లవి నటిస్తుందని అన్నారు. అంతలోనే ఆమె మూవీ నుంచి తప్పుకుందని, ఆమె ప్లేస్ లో జాన్వి కపూర్ ను తీసుకున్నారని రూమర్లు మొదలయ్యాయి. ఇదే విధంగా లంకాధిపతి రావణుడి పాత్రలో యష్ నటిస్తాడని అన్నారు. కానీ తీరా చూస్తే యష్ టాక్సిక్ సినిమాతో బిజీగా ఉన్నారు. అంతేకాదు యష్ హిందీ రామాయణానికి నో చెప్పాడని ప్రచారం జరుగుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ సూర్పణకగా నటిస్తుందని ప్రకటించారు. కానీ నిజానికి ఇంకా నటీనటుల విషయంలో కన్ఫ్యూజన్ నెలకొంది. చిత్ర బృందం అఫీషియల్ గా అన్ని వివరాలు వెల్లడించే దాకా ఈ కన్ఫ్యూజన్ వీడదు. అలాగే రోజుకొక రూమర్ చక్కర్లు కొట్టక మానదు. ఇదిలా ఉంటే నిన్న మొన్నటిదాకా శ్రీరామనవమి సందర్భంగా ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించి, హిందీ రామాయణం మూవీ లాంచ్ ను ఘనంగా ప్లాన్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడేమో బాలీవుడ్ మీడియా రామాయణం ఇప్పట్లో సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ లేదని కోడై కూస్తోంది. అసలు ఇప్పట్లో ఈ మూవీ పట్టాలెక్కే చాన్సే లేదని ఇన్సైడ్ టాక్.

ఇదేనా ప్రాబ్లం?
హిందీ “రామాయణం” మూవీ ఆగిపోతుంది అని రూమర్స్ రావడానికి మెయిన్ రీజన్ కాస్టింగ్ ప్రాబ్లం అని తెలుస్తోంది. నిజానికి ఈ మూవీ మూడు భాగాలుగా తెరకెక్కుతుండడంతో ఈ సినిమాలో నటించే నటీనటుల నుంచి బల్క్ డేట్స్ తీసుకోవాల్సి ఉంటుంది మేకర్స్. ఇప్పుడు అదే ఇక్కడ పెద్ద ఇబ్బందిగా మారింది. ఇప్పటికే విజయ్ సేతుపతి డేట్స్ కారణంగా ఈ మూవీ నుంచి తప్పుకున్నాడు. రణబీర్ తప్పితే ఈ మూవీకి సంబంధించిన నటీనటుల గురించి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఈ ప్రాబ్లమ్స్ చాలవన్నట్టు రణబీర్ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా “యానిమల్” మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రణబీర్ నెక్స్ట్ యానిమల్ పార్క్, బ్రహ్మాస్త్ర 2 సినిమాలను ప్లాన్ చేసుకున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక రామాయణం తెరకెక్కుతుందేమో అనుకుంటే యానిమల్ పార్క్ కు ఇంకా టైం పట్టే అవకాశం ఉంది. ఈ మూవీ కంటే ముందు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ తో “స్పిరిట్” కమిట్ అయ్యాడు. మరి ఈ గజిబిజి షెడ్యూల్స్ అన్నీ పూర్తయ్యి, నటీనటుల బల్క్ డేట్స్ కలెక్ట్ చేసుకుని మేకర్స్ హిందీ రామాయణాన్ని ఎప్పుడు మొదలుపెడతారు అనే ప్రశ్నకు ఇప్పుడైతే ఆన్సర్ లేదు. అందుకే ఈ మూవీ అటకెక్కే ఛాన్స్ ఉందనే ప్రచారం జోరందుకుంది.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు