Janhvi kapoor: హీరోయిన్ జాన్వి వెంటపడుతున్న టాలీవుడ్ హీరోలు ?

మన తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు ఉన్న క్రేజ్ అంతా కాదు. మన ఇండస్ట్రీలో ఒక్కసారి హీరోయిన్ సక్సెస్ అయితే… బాలీవుడ్ వరకు వెళ్తుంది. ఒక్కసారి విఫలం అయితే అసలు ఆ హీరోయిన్ ఎవరు పట్టించుకోరు. అదే బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మన టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎవరైనా హీరోయిన్లు వస్తే మన హీరోలు ఊరుకుంటారా…? అస్సలు ఊరుకోరు. ఆ బ్యూటీ కోసం ఎగబడుతుంటారు.

ప్రస్తుతం బాలీవుడ్ భామ జాన్వి కపూర్ పరిస్థితి అలానే తయారయింది. హీరోయిన్ జాన్వి కోసం టాలీవుడ్ హీరోలు ఎంతో వెయిట్ చేస్తున్నారట. ఆమెతో సినిమా చేయాలని ఎంతో ఆత్రుతగా ఉన్నారట. దీనికి కారణం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోలతో వరుసగా హీరోయిన్ జాన్వి సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగడం.

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా సినిమాలు చేసిన హీరోయిన్ జాన్వి… మన తెలుగులో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ తో అరంగేట్రం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్లో దేవర సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ కోసం చాలా వెతికారు. కానీ అలనాటి హీరోయిన్ శ్రీదేవి కూతురు బాలీవుడ్ భామ జాన్విని ఫైనల్ చేశారు.

- Advertisement -

ఈ సినిమాలో ఓ పల్లెటూరి అమ్మాయి గెటప్ లో జాన్వి అలరించనుందట. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ సరసన చాలా ఎక్స్పీరియన్స్ హీరోయిన్ లా నటించిన జాన్వి. దీంతో రామ్ చరణ్ సినిమాలో కూడా ఈమధ్య ఫైనల్ అయిపోయింది. అంటే బాలీవుడ్ నుంచి వచ్చిన ఈ బ్యూటీ వెలువెంటనే టాలీవుడ్ అగ్ర హీరోలతో సినిమాలు చేస్తోంది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలు ఆమెతో సినిమాలు చేయాలని ఎంతో ఆత్రుతగా చూస్తున్నారట. ఒక్క ఛాన్స్ ఇస్తే రెచ్చిపోవాలని ఆలోచన చేస్తున్నారట.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు