VijayaShanti : అలనాటి స్టార్ కమెడియన్ తో విజయశాంతి రిలేషన్..!

VijayaShanti : తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి స్టార్ హీరోయిన్లలో విజయశాంతి గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈమె తన అద్భుతమైన నటనతో , అందంతో ఎంతోమంది ప్రేక్షకులను అలరించింది.. ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి మరీ నటిస్తూ ఉంటుంది విజయశాంతి… ఒకప్పుడు వరుస సినిమాలు చేసి భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీకి దూరమైందనే చెప్పాలి.. మొన్నామధ్య మహేష్ బాబుతో కలిసి సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీయంట్రి ఇచ్చింది కానీ ఈ సినిమా తర్వాత మళ్లీ సినిమాలలో కనిపించలేదు.. ప్రస్తుతం రాజకీయాలలో క్రియాశీలకంగా మారిన ఈమె గురించి సీనియర్ కమెడియన్ చిట్టిబాబు పలు షాకింగ్ విషయాలు తెలియజేశారు.

స్టార్ కమెడియన్ తో విజయశాంతి…

విజయశాంతి ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా ఒక వెలుగు వెలిగిన రాజబాబు తో చాలా చనువుగా వుండేదట. వీరిద్దరి మధ్య మంచి బంధం ఉండడంతో చాలామంది ఆ బంధాన్ని తప్పుగా అనుకున్నారట.. వీరిద్దరి మధ్య ఏదో కొనసాగుతోందని ..ఈమె రాజబాబును పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యిందని పెద్ద ఎత్తున పలు రకాల న్యూస్ ఛానల్లో వార్తలు కూడా రాసుకొచ్చారట.. అయితే ఇవన్నీ చూసిన కమెడియన్ రాజబాబు నేరుగా ఒక మీడియాను పిలిపించి ఇలాంటి వార్తల వల్ల తనకు ఎలాంటి సమస్య రాదని.. కానీ విజయశాంతి వంటి ఆడపిల్ల, ఆమె క్యారెక్టర్ మీద మచ్చ తీసుకురావద్దంటూ హెచ్చరించారట.

ఎఫైర్ కామెంట్స్ పై రాజబాబు క్లారిటీ..

ఆ ఇంటర్వ్యూలోనే రాజబాబు మాట్లాడుతూ..మా ఇద్దరి మధ్య మంచి బంధం వున్న మాట నిజమే.. అయినప్పటికీ అది తండ్రి కూతుర్ల లాంటి బంధము.. ఎవరు ఏమనుకున్నా.. ఏం రాసుకున్నా.. విజయశాంతి నా కూతురు లాంటిదని తెలియజేశారు.. ఈ విషయాన్ని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో రాజబాబు సోదరుడు సీనియర్ కమెడియన్ చిట్టిబాబు తెలియజేశారు.. అంతేకాకుండా చివరిగా చిట్టిబాబు మాట్లాడుతూ.. తన సోదరుడు రాజబాబు అమ్మాయిలకు కలిగే ఎలాంటి నష్టాన్ని అయినా సరే సహించరు.. ఎవరు చేసినా సహించరు..విజయశాంతి విషయంలో కూడా తన సోదరుడు చాలా ఫీలయ్యారని చిట్టిబాబు వెల్లడించారు.

- Advertisement -

రాజబాబు మంచి మనసుపై చిట్టిబాబు స్పందన..

అలాగే అలాంటి వార్తలు రాసుకుంటే మీ కడుపు నిండుతుంది అనిపిస్తే అలాంటి పనులు చేసుకోండి..కానీ అమ్మాయిల జీవితాలతో ఆడుకోవద్దు అంటూ వివరించారట రాజబాబు.. అంత మంచి మనసున్న వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా ఆయన మీద ఎన్నో రూమర్లు సృష్టించారు.. చివరికి మరణించేటప్పుడు కూడా ఆయన అద్దె ఇంట్లో ఉండి మరణించారు. ఆస్తి అంత పోగొట్టుకున్నారంటూ వార్తలు రాసుకు వచ్చారు ..ఇవన్నీ కూడా అబద్ధాలే అంటూ వెల్లడించారు చిట్టిబాబు. అయితే తన సోదరుడు మరణించే సమయానికి ఆస్తిపాస్తులు చాలానే ఉన్నాయని తమకు కూడా మూడు , నాలుగు ఇళ్లు ఉన్న సమయంలోనే తన సోదరుడు రాజబాబు మరణించారంటూ తెలిపారు.

విజయ శాంతి కెరియర్…

ప్రస్తుతం విజయశాంతి వయసు 57 సంవత్సరాలు.. అయినప్పటికీ నటిగా, నిర్మాతగా, రాజకీయ నాయకురాలుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నది.. ఇక 30 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో వైవిద్యమైన చిత్రాలలో నటించడమే కాకుండా ఇతర భాషలలో కూడా నటించి సుమారుగా 180కుపైగా చిత్రాలలో నటించింది విజయ్ శాంతి. తమిళ్ , కన్నడ, మలయాళం, హిందీ వంటి భాషలలో నటించి తన సత్తా చాటింది. లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ ను కూడా సంపాదించుకుంది విజయశాంతి. అంతేకాదు మొట్టమొదట కోటి రూపాయలు అందుకున్న హీరోయిన్గా కూడా పేరు సంపాదించింది విజయశాంతి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు