Tillu Square OTT : డిజిటల్ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచి అంటే..?

Tillu Square OTT సిద్దు జొన్నలగడ్డ , అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం టిల్లు స్క్వేర్.. ఈ సినిమా ఈ రోజున భారీ హైప్ తో థియేటర్లోకి వచ్చింది. గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైన్మెంట్ చిత్రం ఎట్టకేలకు ఈ రోజున థియేటర్లో విడుదలై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నట్లుగా కనిపిస్తోంది.. 2022లో ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్ గానే టిల్లు స్క్వేర్ తెరకెక్కించడం జరిగింది.

టిల్లు స్క్వేర్ డిజిటల్ స్ట్రీమింగ్ అక్కడే..

అయితే ఈ చిత్రాన్ని మల్లిక్ రామ్ డైరెక్షన్లో తెరకెక్కించారు.. థియేటర్లలో సందడి చేస్తున్న ఈ క్రేజీ మూవీ ఓటీటీ ప్లాట్ఫారంను కూడా ఇప్పుడు లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. టిల్లు స్క్వేర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సైతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫార్మ్లలో ఒకటైన నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నది.. థియేటర్లో రన్ అయిన తర్వాత ఈ చిత్రం ఓటీటీ లోకి రాబోతోంది.. ఈ సినిమా హక్కుల కోసం నెట్ఫ్లిక్స్ భారీ ధర చెల్లించినట్లు సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలో ఆహా.. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్

గతంలో డీ.జే.టిల్లు సినిమాని ఆహా ఓటీటీ సంస్థ తీసుకున్న విషయం తెలిసిందే. కానీ టిల్లు స్క్వేర్ హక్కులను మాత్రం నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు సొంతం చేసుకున్నది.. ఈ సినిమాకు భారీ క్రేజ్ ఉండడంతో థియేటర్ రిలీజ్ ముందే ఓటీటీ డీల్ కూడా కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది..ఈ చిత్రం మే మొదటి వారంలో స్ట్రీమింగ్ అయ్యేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే థియేటర్లో టిల్లు స్క్వేర్ సినిమా రన్ టైం పైన ఆధారపడి ఉంటుందట.. డిజె టిల్లు చిత్రంలో సిద్దు జొన్నలగడ్డ పోషించిన టిల్లు క్యారెక్టర్ ఐకానిక్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్నది. ముఖ్యంగా అందులో చెప్పిన విభిన్నమైన డైలాగ్ డెలివరీ, ఫ్రస్టేషన్ , కామెడీ టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి.

- Advertisement -

బోల్డ్ పాత్రలో అనుపమ..

డిజె టిల్లు కథకు ఇప్పుడు రాబోతున్న టిల్లు స్క్వేర్ స్టోరీ కి సంబంధం ఉందని చిత్ర బృందం ప్రకటించింది. టిల్లు స్క్వేర్ సినిమా నుంచీ విడుదలయిన ట్రైలర్ తర్వాత భారీగా అంచనాలు పెరిగిపోయాయి.. సిద్దు మరొకసారి తన మార్క్ చాటేందుకు కూడా సిద్ధమయ్యారు. అనుపమ పరమేశ్వరన్ ఇందులో చాలా బోల్డ్ క్యారెక్టర్ లో నటించి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మొదటిసారి అనుపమ ఇలాంటి పాత్రలు చేయడం పైన కూడా చర్చనీయాంశంగా మారింది..అనుపమ కూడా తనకు డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలనే ఆశ ఉందని అందుకే ఈ సినిమాలో నటించాను అంటూ కూడా ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. టిల్లు స్క్వేర్ లో మురళీధర్ గౌడ్, ప్రణీత్ రెడ్డి ,సెసిల్ తదితరులు సైతం కీలకమైన పాత్రలలో పోషించారు. ఈ చిత్రంలో లిల్లీ క్యారెక్టర్ లో అనుపమ నటిస్తోంది. ఇకపోతే డీజే టిల్లు చిత్రంలో నేహా శెట్టి పోషించిన రాధిక క్యారెక్టర్ చాలా పాపులర్ అయింది. మరి అనుపమ ఎలాంటి ఇమేజ్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు