Tillu Square Review and Rating : టిల్లు స్క్వేర్ మూవీ రివ్యూ

Tillu Square Review and Rating : 2022 ఫిబ్రవరిలో వచ్చిన ‘డిజె టిల్లు’ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. ఇప్పుడు దానికి సీక్వెల్ గా ‘టిల్లు స్క్వేర్’ రూపొందింది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో ఓ లుక్కేద్దాం రండి :

కథ:

‘డిజె టిల్లు’ లో.. టిల్లుని, రాధిక మోసం చేయడం.. ఆ తర్వాత ఆమెను జైలుకి పంపి బుద్ధిచెప్పి తర్వాత ఆమెకి బెయిల్ ఇప్పించడంతో కథ ముగుస్తుంది. ఇక సీక్వెల్ అయిన ‘టిల్లు స్క్వేర్’ లో లిల్లీ(అనుపమ పరమేశ్వరన్) ఎంట్రీతో అసలు కథ మొదలవుతుంది. ఓ పబ్బులో ఆమె టిల్లు(సిద్ధూ జొన్నలగడ్డ) ని కలవడం జరుగుతుంది. ఆ వెంటనే మాట మాట కలవడం, ఆ తర్వాత లిప్ లాక్స్ పెట్టుకుని బెడ్ షేర్ చేసుకోవడం జరుగుతాయి. అయితే తనకి రిలేషన్ షిప్స్ పై నమ్మకం లేదు అని చెప్పి లిల్లీ తెల్లారాక ఓ లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోతుంది. దీంతో ఆమెతో టిల్లు మళ్ళీ ప్రేమలో పడిపోయి ఆమెకోసం అన్వేషిస్తాడు. సరిగ్గా నెల రోజుల తర్వాత హాస్పిటల్ లో కనిపించి ఆమె ప్రెగ్నెంట్ అని చెప్పి టిల్లుకి షాకిస్తుంది లిల్లీ. దీంతో పెళ్లి చేసుకుంటాను అని లిల్లీకి టిల్లు మాట ఇస్తాడు.

అయితే తర్వాత తన బర్త్ డే రోజున లిల్లీ ఫ్లాట్ కి వెళ్తాడు టిల్లు. ఆ ఫ్లాట్ మరెవరిదో కాదు.. రోహిత్(కిరీటి)ది. అతని ఫ్లాట్ లో లిల్లీ ఏడుస్తూ కూర్చుకుని ఉంటుంది. ఎందుకు ఇలా ఉన్నవని టిల్లు ప్రశ్నించగా.. మా అన్నయ్య ఏడాది నుండి కనిపించడం లేదు అంటూ చెబుతుంది లిల్లీ. అతన్ని రాధిక చంపేసిన విషయం టిల్లుకి గుర్తుకొస్తుంది. తన లవర్ అన్నయ్యని తన ఎక్స్ లవర్ చంపేసింది అని తెలుసుకున్న టిల్లు షాక్ కి గురవుతాడు. రోహిత్ శవాన్ని పాతిపెట్టింది కూడా టిల్లునే అనే సంగతి తెలిసిందే. మరి ఈ విషయం లిల్లీకి తెలిసిందా? తెలిస్తే ఎలా రియాక్ట్ అయ్యింది? అనేది మిగిలిన కథ.

- Advertisement -

విశ్లేషణ:

‘డిజె టిల్లు’ కథ మొత్తం హీరో పాత్ర చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. హీరోయిన్ కి కూడా సమానమైన ప్రాముఖ్యత ఉన్నప్పటికీ.. ఆ సినిమాలో హైలెట్ అయ్యింది అంతా టిల్లు పాత్రే అనడంలో అతిశయోక్తి లేదు. కానీ ‘టిల్లు స్క్వేర్’ విషయానికి వచ్చేసరికి హీరోయిన్ పాత్రకి పెద్ద పీట వేసినట్టు అనిపిస్తుంది. అయినప్పటికీ ఎక్కడా టిల్లు మార్క్ కామెడీ అయితే మిస్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ చాలా ఫన్నీగా ముగుస్తుంది. ఎక్కడా కూడా బోర్ కొట్టదు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగా హైలెట్ అయ్యింది. అయితే సెకండ్ హాఫ్ మాత్రం ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే కొంచెం తక్కువగా అనిపిస్తుంది. క్లైమాక్స్ అయితే ‘డిజె టిల్లు’ లానే అనిపిస్తుంది. ఇంకో సీక్వెల్ ని సిద్ధం చేయడానికే అనుకుంట సేమ్ క్లైమాక్స్ ని డిజైన్ చేశారు. మొదటి భాగానికి విమల్ కృష్ణ డైరెక్ట్ చేశాడు. ‘టిల్లు స్క్వేర్’ ని మల్లిక్ రామ్ డైరెక్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు మల్లిక్ చేసిన సినిమాలు ‘నరుడా డోనరుడా’ ‘అద్భుతం'(ఓటీటీ).. వంటివి పెద్దగా మెప్పించలేదు. డౌట్ లేకుండా అతనికి మొదటి సక్సెస్ అందించిన మూవీగా ‘టిల్లు స్క్వేర్’ నిలుస్తుంది. రన్ టైం కూడా 2 గంటలే ఉండటం ఇంకా ప్లస్ అయ్యింది అని చెప్పాలి.

నటీనటుల విషయానికి వస్తే.. ‘డిజె టిల్లు’ లానే ‘టిల్లు స్క్వేర్’ లో కూడా సిద్ధూ జొన్నలగడ్డ తన మార్క్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. కానీ ఇందులో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ డామినేషన్ ఎక్కువగా కనిపించింది. లిప్ లాక్ సీన్స్ లో ఆమె మునుపెన్నడూ లేని విధంగా రెచ్చిపోయింది. అలాగే యాక్షన్ సీన్స్ లో కూడా నటించి షాకిచ్చింది. అలాగే నేహా శెట్టి కూడా కాసేపు కనిపించి అలరించింది. ఇక మురళీధర్ గౌడ్ మరోసారి మిడిల్ క్లాస్ ఫాథర్ టైపు కామెడీతో అలరించాడు. మురళీ శర్మ తనకి అలవాటైన పాత్రలోనే కనిపించాడు. సో కొత్తగా ఏమీ అనిపించదు.

ప్లస్ పాయింట్స్ :

అనుపమ గ్లామర్
సిద్ధూ జొన్నలగడ్డ నటన
కామెడీ
రన్ టైం

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్ స్లోగా ఉండటం

మొత్తంగా ‘టిల్లు స్క్వేర్‘ .. ‘డిజె టిల్లు‘ రేంజ్లో ఇంప్రెస్ చేసింది అని చెప్పలేం. అలా అని తక్కువ చేయలేము. 2 గంటల పాటు ఎంటర్టైన్ అవ్వాలంటే థియేటర్ కి వెళ్లి ఈ సినిమా చూడాల్సిందే

రేటింగ్: 2.75 /5

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు