Tillu Square : మూడు రోజుల ముందే రచ్చ..

Tillu Square : టిల్లు గాడు ఫైనల్ గా మరో మూడు రోజుల్లో థియేటర్ల ముందు రాబోతున్నాడు. రెండు నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా మార్చి 29న థియేటర్లలో రచ్చ చేయడానికి రెడీ అవుతుంది. ఈ సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయని తెలిసిందే. అది ఎంతలా అంటే ఎప్పుడు ఏ సీజన్లో వచ్చినా కూడా జనాలు ఎగబడేంత. ఎందుకంటే డీజే టిల్లు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది మరి. రెండేళ్ల కింద విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన డీజే టిల్లు రిలీజ్ కి ముందు ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లు కొల్లగొట్టింది. నిర్మాత నాగవంశీకి పెట్టుబడికి మూడు రెట్ల లాభం రావడం విశేషం. ఇక ఈ సినిమాలో కొన్ని బోల్డ్ సన్నివేశాలున్నప్పటికీ జనాలు ఫ్యామిలీతో వెళ్లారు అప్పట్లో. ఇప్పుడు సీక్వెల్ కూడా అంతకు మించి అంచనాలతో రిలీజ్ అవుతుంది.

అయితే ఫస్ట్ పార్ట్ ని విమల్ కృష్ణ దర్శకత్వం వహించగా, రెండో పార్ట్ ని మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు. రామ్ మిరియాల మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే కూడా సిద్ధూ జొన్నలగడ్డ అందించడం విశేషం. ఇక రెండో పార్ట్ ని కూడా నాగ వంశి నిర్మించాడు. నిజానికి ఈ సినిమా పలు సినిమాలతో పాటు ఫిబ్రవరిలో పోటీలో రిలీజ్ కావాల్సింది. కానీ నిర్మాతలు ఇతర డిస్ట్రిబ్యూటర్ల విన్నపంతో పోటీ నుండి తప్పుకుని వాయిదా వేసి, ఇప్పుడు ఫైనల్ గా సోలో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ తో పాటు సాంగ్స్ కూడా ఆడియన్స్ ని మెప్పించాయి. అందుకే నిర్మాతలు కూడా ఆ అంచనాలని క్యాష్ చేసుకుని భారీ ఓపెనింగ్స్ పై కన్నేశారు.

అక్కడ ఇప్పట్నుంచే రచ్చ మొదలు..

టిల్లు స్క్వేర్ కామెడీ ఎంటర్టైనర్ తో కూడిన రొమాంటిక్ మూవీ గా తెరకెక్కగా, రెండో పార్ట్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి 30కోట్లకి పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది. టిల్లు స్క్వేర్ పై ఉన్న క్రేజీ బజ్ కి ఒక్క నైజాంలోనే 10 కోట్ల వరకు బిజినెస్ జరిగిందట. ఇక ఈ సినిమాకు ఓవర్సీస్ లో కూడా భారీగా రిలీజ్ చేస్తున్నారు. అక్కడ ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ అవగా ఇప్పటికే 100k డాలర్లు వసూలు చేసిందట. అది కూడా రిలీజ్ కి మూడు రోజుల ముందే రచ్చ చేయడం విశేషం. ఇక ప్రీమియర్స్ తో కలిపి 300k డాలర్ల వరకు టిల్లు స్క్వేర్ ఓవర్సీస్ లో ఓపెనింగ్స్ రావొచ్చని అర్చన వేస్తున్నారు. ఇక నైజాంలో దాదాపు 2 నుండి 3 కోట్ల వరకు ఓపెనింగ్స్ తెచ్చుకోవచ్చని అంచనా వేస్తున్నారు. మరి చూడాలి రిలీజ్ రోజు టిల్లు గాని రచ్చ ఎంతుంటుందో.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు