Roopa Koduvayur : ఈ తెలుగమ్మాయి లక్కీనే.. కానీ కానీ సక్సెస్?

రూప కొదువయూర్. ఈ అమ్మాయిని చూస్తే చాలా మంది ఈ అమ్మాయిని కేరళ కుట్టి అనే అనుకుంటారు. ఎందుకంటే ఈ అమ్మాయి రూపం గాని, పేరు గాని అలాగే ఉంటుంది. చూడ్డానికి చక్కగా నల్ల కాలువ కళ్ళతో, రింగు రింగుల జుట్టుతో కనిపించే ఈ భామ మలయాళీ కాదు. స్వచ్ఛమైన తెలుగమ్మాయి. విజయవాడ కి చెందిన ఈమె తెలుగు సినిమాల్లో ఎప్పుడో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ అది చాలా మందికి తెలియదు. సినిమాలు రెగ్యులర్ గా చూసే జనాలకి తెలిసి ఉండొచ్చు. అప్పుడెప్పుడో సత్యదేవ్ హీరోగా నటించిన “ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య” సినిమా లాక్ డౌన్ లో ఓటిటి లో రిలీజ్ కావడం వల్ల ఎక్కువ మందికి తెలియలేదు. కానీ మౌత్ టాక్ తో ఓటిటి లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే ఎంతైనా ఓటిటి లో వచ్చింది కాబట్టి సామాన్య ప్రేక్షకులకు తెలియలేదు.

అయితే లాస్ట్ ఇయర్ మాత్రం బిగ్ బాస్ సోహైల్ నటించిన మిస్టర్ ప్రెగ్నెంట్ అనే సినిమాతో మళ్ళీ ఆడియన్స్ ముందుకు వచ్చింది. కామెడీ ఎంటర్టైనర్ గా సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా అంతగా ఆడలేదు. కానీ రూప నటించిన రెండు సినిమాల్లో కూడా తన అందంతో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. అందుకే ముచ్చటగా మూడోసారి తనకి సినిమా ఆఫర్ వరించింది. అది కూడా టాలీవుడ్ లో ప్రత్యేకమైన పేరు ఇమేజ్ ఉన్న దర్శకుడి సినిమాలో. ఆయనే మోహన కృష్ణ ఇంద్రగంటి. ఈయన తెరకెక్కిస్తున్న కొత్త సినిమాలో ప్రియదర్శి హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఓపెనింగ్ అట్టహాసంగా జరిగింది. శ్రీదేవి మూవీస్ పతాకంపై కృష్ణ ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ బ్యానర్ లో ఇంద్రగంటి ఇంతకు ముందు నానిస్ జెంటిల్ మెన్, సమ్మోహనం వంటి సక్సెస్ ఫుల్ చిత్రాల్ని నిర్మించగా, ఇప్పుడు మూడో సారి ఈ కాంబోలో సినిమా వస్తుంది.

ఇక రూప కొదువయుర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి వివేక్ సాగర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఏప్రిల్ లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా తో రూప ఎలాగైనా హిట్టు కొట్టి సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కాలని చూస్తుంది. పైగా అందం, టాలెంట్ కూడా ఉన్న ఈ అమ్మాయికి సక్సెస్ కూడా తోడైతే మరో తెలుగమ్మాయి ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటుందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక రూప కొదువయూర్ హీరోయిన్ కాకన్నా ముందే ఒక డాక్టర్ అనే విషయం కూడా చాలా మందికి తెలియదు. అది కూడా మాములు సర్జన్ కాదు. ఈమె ఒక “ఆంకాలజిస్ట్”. అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసే డాక్టర్ అన్నమాట. ఆమె తల్లి కోరిక మేరకు ఈమె డాక్టర్ అయ్యింది. రూప తల్లి కూడా ఒక క్యాన్సర్ పేషేంట్ కావడంతో తన తల్లికి వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదని తాను డాక్టర్ అయ్యిందని పలు ఇంటర్వ్యూ లలో చెప్పింది. మరి రూప కొదువయూర్ సినిమాల్లో కూడా సక్సెస్ అవుతుందా లేదా అనేది చూడాలి.

- Advertisement -

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు