LegendReRelease : మొన్నే దెబ్బపడింది.. మళ్ళీ అవసరమా అంటున్నారు?

టాలీవుడ్ లో చాలా రోజులుగా రీ రిలీజ్ సినిమాలు రెగ్యులర్ సినిమాల స్థాయిలో రిలీజ్ అవుతున్నాయన్న సంగతి తెలిసిందే. దాదాపు రెండేళ్ల క్రితం మొదలైన ఈ హుంగామా డబ్బింగ్ సినిమాల రీ రిలీజ్ దాకా సాగింది. ఇక రీ రిలీజ్ సినిమాల్లో అన్ని జోనర్ల సినిమాలనే కాదు, ఏకంగా ప్లాప్ అయిన సినిమాలు కూడా రీ రిలీజ్ అయ్యాక బ్లాక్ బస్టర్ అవడం చూసాం. లాస్ట్ ఇయర్ రీ రిలీజ్ అయిన ఆరెంజ్ సినిమా ఏ రేంజ్ కలెక్షన్లు కొల్లగొట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ బర్త్ డే కానుకగా మగధీర ని కూడా రీ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ మధ్య సందర్భం లేకపోయినా చిన్న చిన్న వాటికి కూడా కొన్ని సినిమాలు రీ రిలీజ్ చేస్తున్నారు. పైగా అభిమానులు ప్రతిష్టాత్మకంగా దగ్గరుండి మరీ మళ్ళీ ట్రైలర్ లు రిలీజ్ చేసి సినిమాలు రీ రిలీజ్ చేస్తున్నారు. అయితే జనాల డిమాండ్ ఉంటే ఒకే. కానీ అవసరం లేకపోయినా, ఫ్యాన్స్ డిమాండ్ లేకపోయినా కూడా సినిమాల్ని రీ రిలీజ్ చేస్తే థియేటర్లకు జనాలు రారన్న విషయం గమనించాలి.

ఈ మధ్య కాలంలో నందమూరి బాలకృష్ణ సినిమాలైతే డిమాండ్ లేకున్నా రిలీజ్ చేస్తూ ఉండడంతో ఆడియన్స్ కూడా విసుగు చెందుతున్నారు. ఆ మధ్య చెన్నకేశవ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 500 థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. కానీ ఆ సినిమాకి నందమూరి అభిమానులు తప్ప కామన్ ఆడియన్స్ పెద్దగా రాలేదు. అప్పట్లో ఈ సినిమాకి 50 లక్షల వరకు వసూళ్లు వచ్చినా కూడా రిలీజ్ అయిన థియేటర్లతో పోలిస్తే చాలా తక్కువని చెప్పాలి. ఇక మొన్నటికి మొన్న సమరసింహారెడ్డి సినిమాని రిలీజ్ అయి పాతికేళ్ళు అయిన సందర్బంగా రీ రిలీజ్ చేసారు. ఈ సినిమా కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ అయింది. అయితే ఈ సారి నందమూరి ఫ్యాన్స్ కూడా దెబ్బేసారు. ఎక్కడో సీడెడ్ లో కొన్ని ఏరియాల్లో తప్ప ఈ సినిమాని ఎక్కడ చూడలేదు జనాలు. ఇక ఇప్పుడు బాలయ్య నుండే మళ్ళీ మరో సినిమా రీ రిలీజ్ అవుతుంది.

లెజెండ్ రీ రిలీజ్..

- Advertisement -

నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబోలో వచ్చిన లెజెండ్ సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ప్లాపుల్లో ఉన్న బాలకృష్ణ కు మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి తెచ్చిన ఈ సినిమా నందమూరి అభిమానుల్లో జోష్ నింపింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయి పదేళ్లయిన సందర్బంగా మళ్ళీ మార్చి 30న రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇలా డిమాండ్ లేకున్నా ఎప్పుడు పడితే అప్పుడు రీ రిలీజ్ చేస్తే నందమూరి అభిమానులకి కూడా విసుగొస్తుందని ట్రేడ్ పండితులు అంటున్నారు. పైగా సమర సింహారెడ్డి రీ రిలీజ్ అయి రెండు నెలలు కూడా కాలేదు. మళ్ళీ బాలయ్య సినిమానే అంటే కనీసం ఫ్యాన్స్ దగ్గర డబ్బులైనా ఉండాలిగా అంటూ నెటిజన్లు ఒకరకంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే బాలయ్య అభిమానుల పైత్యమా లేక ఇంకేదైనా కారణమా? తెలీదు గాని లెజెండ్ సినిమాని మాత్రం డిమాండ్ లేకపోయినా మళ్ళీ భారీ ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసేందుకు చూస్తున్నారని సమాచారం. కానీ ఈ సినిమా మాత్రం ఇప్పుడు రీ రిలీజ్ అయితే అంతగా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభావం చూపకపోవచ్చు అని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉంటుందో తెలియాలంటే మార్చి 30వరకు ఆగాలి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు