Jason Sanjay : దళపతి విజయ్ వారసుడి ఎంట్రీకి రంగం సిద్ధం… కానీ హీరోగా కాదు

Jason Sanjay : తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ సినీ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైంది. కానీ ఈ స్టార్ హీరో వారసుడు హీరోగా కాకుండా దర్శకుడిగా తన సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటికే జేసన్ సంజయ్ డైరెక్టర్ గా ఓ ప్రాజెక్ట్ ఫైనల్ కాగా, ఓ బడా ప్రొడక్షన్ హౌస్ ఆ మూవీని నిర్మించడానికి రెడీ అయ్యింది. మరి ఆ మూవీ బ్యాక్ డ్రాప్ ఏంటి? నటీనటులు ఎవరు? అనే వివరాల్లోకి వెళ్తే…

హీరో కాదు డైరెక్టర్…

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో వారసులు కూడా హీరోలుగానే ఎంట్రీ ఇస్తూ ఉంటారు. తండ్రి వారసత్వాన్ని నిలబెట్టడానికి శతవిధాలా ప్రయత్నిస్తారు. అభిమానులు కూడా అదే ఆశిస్తారు. కానీ హీరో కొడుకు హీరోగా ఎంట్రీ ఇస్తే తండ్రికి తగ్గ వారసుడు అనిపించుకోవడానికి వాళ్ళు పడే కష్టం మామూలుగా ఉండదు. మొదటి సినిమా నుంచే కంపారిజన్ మొదలవుతుంది. అన్నింటినీ దాటుకొని సినిమాలు చేసుకుంటూ వెళ్తే వాళ్ళు సక్సెస్ అవుతారా లేదా ఫెయిల్ అవుతారా అనేది లక్ పై ఆధారపడి ఉంటుంది. ఇప్పటిదాకా ఎంతో మంది స్టార్ వారసులు ఫెయిల్యూర్ కారణంగా సినిమా ఇండస్ట్రీలో డీలా పడిన పరిస్థితులను మనం చూసాం. అదే స్టార్ హీరో వారసుడు డిఫరెంట్ వేలో తన టాలెంట్ ను నిరూపించుకునే ప్రయత్నం చేస్తే… ఈ ఒత్తిడి అంతా ఉండనే ఉండదు.

అందుకేనేమో కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ వారసుడు జేసన్ సంజయ్ తన తండ్రిలా హీరో కాకుండా మెగా ఫోన్ పట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. రెండేళ్ల క్రితం నుంచే విజయ్ కొడుకు సినిమా ఎంట్రీ గురించి వార్తలు మొదలయ్యాయి. అంతకంటే ముందే తన తండ్రి విజయ్ సినిమాల్లో సంజయ్ ( Jason Sanjay ) గెస్ట్ రోల్స్ చేశాడు. మొత్తానికి ఎప్పటినుంచో డైరెక్టర్ కావాలని కలలు కంటున్న సంజయ్ కల నెరవేరే సమయం ఆసన్నమైంది. విజయ్ కొడుకు కథతో సినిమా తీస్తామని చాలాకాలం క్రితమే లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. ఈ మేరకు లైకా ప్రొడక్షన్ తో సంజయ్ దర్శకత్వానికి సంబంధించిన ఒప్పందం కుదిరినట్టు సమాచారం.

- Advertisement -

సంజయ్ ఫస్ట్ మూవీ బ్యాక్ డ్రాప్, నటినటులు… ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్యాస్టింగ్ ఇంకా మొదలు కాలేదని తెలుస్తోంది. నటీనటులు ఎవ్వరూ ఇంకా ఫైనలైజ్ కాలేదు. క్రికెట్ నేపథ్యంలో ఈ మూవీ రూపొందనుందని సమాచారం. గత కొంతకాలంగా ఈ సినిమాలో హీరో అంటూ రోజుకో స్టార్ హీరో పేరు వైరల్ అవుతుంది. అందులో విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్, దుర్గం సల్మాన్ పేర్లు వినిపించాయి. ముందుగా ధ్రువ విక్రమ్ హీరోగా, మరో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ గా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని రూమర్లు వచ్చాయి. కానీ ఆ తర్వాత విజయ్ కొడుకు తన మొదటి మూవీకి పాన్ ఇండియా స్టార్ సేమ్ ఉన్న దుల్కర్ సల్మాన్ ను ఎంచుకున్నాడని ప్రచారం జరిగింది.

ఫిలిం మేకింగ్ లో శిక్షణ…

సంజయ్ జాసన్ టొరెంటో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఫిలిం ప్రొడక్షన్లో పట్టా అందుకున్నాడు. లండన్ ఫిలిం స్కూల్ నుండి స్క్రీన్ రైటింగ్ లో శిక్షణ కూడా పొందారు. దర్శకత్వం మీద ఉన్న ఆసక్తితోనే హీరోగా అవకాశాలు వచ్చినప్పటికీ సంజయ్ వదులుకున్నాడు. సుధా కొంగర, అల్ఫోన్స్ వంటి దర్శకుల సినిమాలో నటించే అవకాశం సంజయ్ కి వచ్చిందట. అయినప్పటికీ అన్నింటినీ పక్కన పెట్టి డైరెక్టర్ కావాలన్న తన కలను సాకారం చేసుకుంటున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు