Singer Kousalya: మళ్లీ పెళ్లి పై కొడుకు స్పందన..!

Singer Kousalya.. ప్రముఖ సింగర్ కౌసల్య గురించి శ్రోతలకు పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన గాత్రంతో ఎన్నో పాటలను అందించి ప్రేక్షకులను మెప్పించింది. టాలీవుడ్ లో స్టార్ సింగర్ గా ఒక వెలుగు వెలుగిన ఈమే 1999లో నీకోసం అనే సినిమాతో సింగర్ గా పరిచయమైంది.. ఆ తర్వాత తెలుగులో యంగ్ హీరోల హిట్ చిత్రాలలో పాటలు పాడి స్టార్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకొని కొద్ది రోజులు బాగానే అవకాశాలు దక్కించుకుంది. అదే సమయంలో హీరోయిన్ కళ్యాణికి కూడా కొన్ని సినిమాలలో డబ్బింగ్ చెప్పి తన గొంతుతో అందరినీ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ..

Singer Kousalya: Son's reaction on remarriage..!
Singer Kousalya: Son’s reaction on remarriage..!

మళ్ళీ పెళ్ళి పై నా కొడుకు ఏమన్నారంటే..

సింగర్ గా, నటిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేసిన ఈమె తన టాలెంట్ తో కెరియర్ లో ముందడుగు వేసింది. కెరియర్ లో సక్సెస్ఫుల్గా కొనసాగిన ఈమె.. పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొంది.. ఒక కొడుకు పుట్టాక భర్త తో విడాకులు తీసుకున్న ఈమె అందుకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కౌసల్య.. తాను విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏమిటి? అలాగే తన కొడుకు తనను మళ్ళీ పెళ్లి చేసుకుంటానంటే ఏమన్నారు? అన్న విషయాలపై ఆమె క్లారిటీ ఇచ్చింది..

నా భర్తతో నరకం చూశా..

కౌసల్య మాట్లాడుతూ.. నా భర్త ఇంట్లో నాకు స్వేచ్ఛ ఉండేది కాదు.. అతనితో పాటు ఆయన ఫ్యామిలీ కూడా నన్ను చిత్రహింసలకు గురి చేసేవారు.. అంతేకాకుండా నా భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్లే విడాకులు తీసుకోవాల్సి వచ్చింది..అయితే ఈ విషయం నాకు తెలియకుండా చాలా రోజులు మెయింటైన్ చేశాడు.. కానీ చివరికి నాకు తెలియడంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుని విడిపోయాను.. నా కొడుకు బాధ్యతను తీసుకొని పెంచి పెద్ద చేశాను. ప్రస్తుతం మా అబ్బాయి నన్ను ఒంటరిగా ఉండకుండా తోడుగా ఉండేందుకు ఇంకో పెళ్లి చేసుకోమని చెబుతున్నారు.. నన్ను జాగ్రత్తగా చూసుకుని నాకు అండగా.. నా కొడుకును తన కొడుకుగా స్వీకరించే వారు దొరికితే మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే అన్నట్టుగా కౌసల్య చెప్పుకొచ్చింది. మొత్తానికైతే కౌసల్య చెప్పిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -

కౌసల్య కెరియర్..

తెలుగు సినీ నేపథ్య గాయనిగా గుర్తింపు తెచ్చుకున్న కౌసల్య సొంత ఊరు గుంటూరు.. నాగార్జున సాగర్ లోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో పదవ తరగతి వరకు చదివింది. మిగతా చదువు అంతా వివిధ చోట్ల సాగింది. గుంటూరులో మహిళా కళాశాలలో ఇంగ్లీషు సాహిత్యంతో పాటు కర్ణాటక సంగీతంలో కూడా డిగ్రీ పొందింది ఈ ముద్దుగుమ్మ.. ఇక తర్వాత పద్మావతి విశ్వవిద్యాలయంలో శాస్త్రీయ సంగీతంలో పీజీ పూర్తి చేసిన కౌసల్య చిన్ననాటి స్నేహితుడు, వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన బాలసుబ్రహ్మణ్యం ఇంటర్లో ప్రేమించి మరి పెళ్లి చేసుకుంది.. ఇక వీరికి ఒక అబ్బాయి జన్మించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరి మధ్య విభేదాలు, అతడు ఇంకొక అమ్మాయితో ఎఫైర్ కొనసాగించడం.. లాంటివి జీర్ణించుకోలేకపోయిన సింగర్ కౌసల్య అతడి నుంచి విడిపోయి ఒంటరిగా కొడుకుతో జీవిస్తోంది.. ఇప్పుడు మళ్ళీ పెళ్లిపై తన కొడుకు అభిప్రాయాన్ని వెల్లడించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు