Sabari : పాన్ ఇండియా సినిమాగా వరలక్ష్మి చిత్రం?

Sabari : కోలీవుడ్ స్టార్ శరత్ కుమార్ కూతురు గా సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎంట్రీ ఇచ్చిన కొత్తలో పలు సినిమాలతో సక్సెస్ కొట్టి దూసుకుపోయింది. కానీ ఆ తర్వాత వరుస ప్లాపులతో అంతగా హీరోయిన్ గా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత సినిమాల్లో ప్రత్యేకపాత్రల్లో నటించడం స్టార్ట్ చేసింది. ఓ రకంగా ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకోవచ్చు. ఈ క్రమంలో పందెం కోడి 2 సినిమాతో విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన వరలక్ష్మీ కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయింది. ఆపై వరుస సినిమాలతో సక్సెస్ కొట్టింది. సర్కార్, వంటి పెద్ద సినిమాల్లో సూపర్ విలనిజం చూపించింది. ఇక ఆ తర్వాత కోలీవుడ్ ను వదిలి టాలీవుడ్ పై ఫోకస్ చేసి ఇక్కడ కూడా సక్సెస్ అయింది. యశోద, వీర సింహారెడ్డి, లేటెస్ట్ గా హనుమాన్ చిత్రాల్లో విభిన్న పాత్రల్లో కనిపించడంతో కెరీర్ మొత్తం ఫుల్ స్పీడ్ తో సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. అయితే వరలక్ష్మి మెయిన్ లీడ్ గా ఇప్పుడు మళ్ళీ సినిమాలు చేయబుతుంది. హీరోయిన్ గా కాకపోయినా ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

శబరి గా వరలక్ష్మి..

వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఫిమేల్ ఓరియంటెడ్ చిత్రం ‘శబరి'(Sabari). తెలుగు లో తెరకెక్కిన ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కడం జరిగింది. అనిల్ కట్జ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను మహా మూవీస్ బ్యానర్ లో మహేంద్ర నాథ్ కొండ్ల నిర్మించాడు. గోపి సుందర్ మ్యూజిక్ అందించాడు. తాజాగా ఈ సినెమా ట్రైలర్ రిలీజ్ కాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలో వరలక్ష్మి ద్విపాత్రాభినయం చేస్తుందని అనిపిస్తుంది. ట్రైలర్ చుస్తే అక్కడక్కడా క్షణం, పెంగ్విన్ సినిమాల ఛాయలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా మే 3న రిలీజ్ కి రెడీ అవుతుంది. శశాంక్ శబరి సినిమాలో కీలక పాత్రలో నటించాడు.

పాన్ ఇండియా సినిమాగా..?

ఇక తెలుగులో వరలక్ష్మీ శరత్ కుమార్ ఫుల్ బిజీ అయిందనే చెప్పొచ్చు. ఓ సినిమాలో కనిపించింది అంటే, అది హిట్ అయినట్టే అనే సెంటిమెంట్ కూడా ఉంది. యశోద గానీ, వీర సింహా రెడ్డి, గానీ, ఇటీవల వచ్చిన హనుమాన్ సినిమాలో గానీ వరలక్ష్మీ ఫర్మామెన్స్ నెక్ట్స్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు శబరి తో ఫిమేల్ లీడ్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఇక శబరి సినిమా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాబోతుందని మేకర్స్ ట్రైలర్ ద్వారా ప్రకటించారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం తో పాటు హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారట. అయితే ట్రైలర్ చూడ్డానికి బాగానే ఉన్నా, క్వాలిటీ పరంగా పాన్ ఇండియా రేంజ్ లో లేదని అనిపిస్తుంది. అందువల్ల సినిమా సౌత్ పరంగా బాగుంటే క్లిక్ అవొచ్చేమో గాని, హిందీలో కష్టమని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఇక ఈ సినిమాలో శశాంక్, గణేష్ వెంకట్రామన్, మిమే గోపి, సునయన, బేబీ కృతిక, రాజశ్రీ నంబియార్, భద్రం, కృష్ణ తేజ కీలక పాత్రల్లో నటించారు. మరి ఈ సినిమాతో ఫిమేల్ లీడ్ గా వరలక్ష్మి మళ్ళీ సక్సెస్ అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు