RGV: నిండు చందురుడు ఒక వైపు… చుక్కలు ఒక వైపు – వర్మకే సాధ్యమిది

నలుగురికి నచ్చినది…
నాకసలే ఇక నచ్చదురో…
నరులెవరూ నడవనిది…
ఆ రూట్లో నే నడిచెదరో… అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన టక్కరి దొంగ అనే సినిమాలో ఓ సాంగ్ ఉంటుంది. అందులో… “నిండు చందురుడు ఒక వైపు… చుక్కలు ఒక వైపు. నేను ఒక్కడిని ఒక వైపు… లోకం ఒక వైపు” అంటూ లిరిక్స్ ఉంటాయి. ఈ లిరిక్స్ టక్కరి దొంగ సినిమాలో మహేష్ బాబుకు సెట్ అయ్యాయో లేదో తెలియదు కానీ, నిజ జీవితంలో ట్రెండ్ సెట్టర్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు అయితే బాగా సెట్ అవుతాయి.

ఇప్పుడు ఈ పాట ఎందుకు గుర్తు వచ్చింది అంటారా… ప్రత్యేకంగా ఏం లేదు. రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా, ఈ సాంగ్ గుర్తొస్తుంది. రీసెంట‌్‌గా పూనమ్ పాండ్ తాను బతికే ఉన్నానని, క్యాన్సర్ అవగాహన కోసం ఇలా చేశాను అంటూ వీడియోలో చెప్పుకొచ్చింది. దీంతో నెట్టింట్లో ఈమెపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. చేసింది మంచి పని కోసమే అయినప్పటికీ ఎంచుకున్న దారి కరెక్ట్ కాదు అంటూ కొంత మంది సెలబ్రెటీలు విమర్శలు చేశారు. ఇక నెటిజన్లు అయితే దారుణంగా ట్రోల్స్ చేశారు.

కానీ, మిస్టర్ ట్రెండ్ సెట్టర్ రామ్ గోపాల్ వర్మ అయితే… పూనమ్ చేసిన పనిపై ప్రశంసలు కురిపించారు. సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించడానికి పూనమ్ తీసుకుంది కఠినమైన పద్దతి అని అన్నారు. దీని వల్ల ఆమెపై విమర్శలు రావొచ్చు. కానీ, ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్‌ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు అంటే ఆమె వల్లే అని అన్నారు. పూనమ్ లానే ఆమె సోల్ కూడా చాలా బ్యూటీఫుల్‌గా ఉందని, ఆమె జీవితాంతం సంతోషంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్టు తన సోషల్ మీడియా అకౌంట్స్ లో రాసుకొచ్చాడు.

- Advertisement -

ఇలాంటి ట్వీట్స్ వేయడం రామ్ గోపాల్ వర్మకు కొత్తేమీ కాదు. తను అందరూ నడిచే బాటలో నడవలేడని, అలా అని ఆయన నడిచే రూట్‌లో మిస్టేక్స్ ఉండవని, ఇప్పుడు పూనమ్ కు సపొర్ట్ చేసిన పోస్ట్ లో కూడా రామ్ గోపాల్ వర్మ మెచ్యూరిటీ కనిపిస్తుంది అంటూ కొంత మంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు