Honey Rose: బాలయ్య హీరోయిన్ డిమాండ్ మామూలుగా లేదుగా..?

Honey Rose

మలయాళీ ముద్దుగుమ్మ హనీ రోజ్ గతంలో చాలా సినిమాలలో తెలుగులో నటించింది.. కానీ ఏ ఒక్క సినిమా కూడా ఈమెకు మంచి గుర్తింపును అందివ్వలేదు.. కానీ గత ఏడాది బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.. మీనాక్షి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది.. ఈ సినిమా తర్వాత సౌత్ లో క్రేజీ ఫిగర్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ఈమె చేతిలో సినిమాలు లేకపోయినా మాల్స్ , షోరూమ్స్ ప్రారంభోత్సవానికి వెళ్తూ భారీగా సంపాదిస్తోంది.. రీసెంట్గా ఒక జువెలరీ షోరూం లాంచ్ చేసింది. అక్కడ స్లీవ్ లెస్ రెడ్ బ్లౌజ్ తో పాటు ఫ్లోర్ లెంగ్త్ రెడ్ లంగా వేసుకొని.. మెరుపుతీగలా తన అందచందాలతో అక్కడి వారిని ఆకట్టుకుంది..

ముఖ్యంగా అక్కడికి వచ్చిన వాళ్ళ కళ్ళని హనీ రోజ్ అందాలు ఆకర్షించాయని చెప్పవచ్చు.. మెడలో డైమండ్స్ పొదిగిన హారం వేసుకున్న హనీరోజ్ అక్కడికి వచ్చిన వారికి స్టేజ్ పైనుంచి ఫ్లయింగ్ కిస్సులు ఇస్తూ ఉక్కిరిబిక్కిరి చేసింది.. చూడడానికి తెల్లగా పాలరాతి బొమ్మలా ఉండే ఈమె.. అందానికి తగ్గట్టుగా రెడ్ కలర్ డ్రెస్ వేయడంతో మరింత లుక్ వచ్చేసిందని చెప్పవచ్చు. ఇకపోతే సినిమాలలో నటించకపోయినా.. ఇలా వరుసగా షాపింగ్ మాల్స్ , షోరూమ్స్ అంటూ భారీగానే సంపాదిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా తాజాగా ఈమెకు సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారుతుంది.. బాలయ్య సినిమాలో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమెకు మరోసారి బాలయ్య సినిమాలో నటించే అవకాశం వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..

బాలయ్య తన తదుపరి సినిమాలో కూడా హనీ రోజు ఒక కీలక పాత్రలో కనిపించనుందని సమాచారం. ఇకపోతే మలయాళం సినిమాలో వరుసగా అవకాశాలు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో సరైన సక్సెస్ కోసం ఎదురు చూసింది ..అలా బాలయ్య సినిమాతో భారీ సక్సెస్ అందుకొని ఇప్పుడు సౌత్ ఆడియన్స్ కి కూడా బాగా దగ్గర అయింది. ఇకపోతే హీరోయిన్ రేంజ్ లో అందం ఉన్నప్పటికీ సినిమాలలో హీరోయిన్ అవకాశాలు మాత్రం రావడం లేదు.. దీనికి కారణం ఆమె అధిక బరువే అని తెలుస్తోంది.. సాధారణంగా హీరోయిన్లను నాజుగ్గా ఊహించుకునే ప్రేక్షకులు.. అధిక బరువుతో ఉంటే చూడడం కష్టమని దర్శక నిర్మాతలు కూడా ఈమెను హీరోయిన్గా పెట్టుకోవడానికి ముందడుగు వేయడం లేదు.కానీ హీరోయిన్గా నటిస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఒకవేళ హనీ రోజ్ స్లిమ్ ఫిగర్ మెయింటైన్ చేస్తే కచ్చితంగా ఈమెకి హీరోయిన్ అవకాశాలు వస్తాయనడంలో సందేహం లేదు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు