Chiranjeevi Remake Movies : మెగాస్టార్ ఇప్పటిదాకా ఎన్ని రీమేక్ లలో నటించారంటే?

Chiranjeevi Remake Movies

మెగాస్టార్ చిరంజీవి ఇప్పటిదాకా 150కి పైగా సినిమాలను పూర్తి చేసి ఇండస్ట్రీలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. అయితే ఇప్పటివరకు ఆయన తన కెరీర్లో 50 పైగా రీమేక్ సినిమాల్లో నటించడం విశేషం. చిరంజీవి కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన ఎక్కువ సినిమాలు రీమేక్ కావడం గమనార్హం. ఆయన ఇప్పుడు మెగాస్టార్ రేంజ్ కి రావడానికి ఆ సినిమాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. మరి కెరీర్ మొదటి నుంచి ఇప్పటిదాకా ఆయన నటించిన రీమేక్ సినిమాలపై ఓ లుక్కేద్దాం ఇప్పుడు.

మన ఊరి పాండవులు
కృష్ణంరాజు, మురళీమోహన్, చిరంజీవి హీరోలుగా రూపొందిన “మన ఊరి పాండవులు” సినిమా కన్నడలో “పాడువారళ్లి పాండవులు” అనే సినిమాకు రీమేక్ గా రూపొందింది.

ఇది కథ కాదు
కమల్ హాసన్, చిరంజీవి, శరత్ బాబు, జయసుధ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ మూవీ తమిళంలో కమల్ హాసన్, రజినీకాంత్ , రవికుమార్ ప్రధాన పాత్రల్లో రూపొందిన “అవర్గళ్” మూవీకి రీమేక్. ఈ చిత్రంలో చిరు నెగిటివ్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నారు.

- Advertisement -

పున్నమినాగు
కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ “హున్నిమేయ రాత్రియల్లి” అనే కన్నడ మూవీకి పున్నమినాగు రీమేక్. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

ప్రేమ తరంగాలు
అమితాబ్, వినోద్ ఖన్నా హీరోలుగా రూపొందిన “ముఖద్దర్ క సికిందర్” మూవీకి రీమేక్ ఈ “ప్రేమ తరంగాలు”. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.

మోసగాడు
శోభన్ బాబు, చిరంజీవి, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన “మోసగాడు” మూవీ “ఖాన్ దోస్త్” అనే హిందీ సినిమాకు రీమేక్. ఇది సూపర్ హిట్ మూవీ.

మొగుడు కావాలి
“మంచిలి” అనే హిందీ సినిమాకు రీమేక్ “మొగుడు కావాలి”. కట్ట సుబ్బారావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ఈ మూవీ మంచి ఫలితాన్ని అందుకుంది.

చట్టానికి కళ్ళు లేవు
ఎస్ ఏ చంద్రశేఖర్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందిన “చట్టానికి కళ్ళు లేవు” అనే మూవీ, విజయ్ కాంత్ హీరోగా నటించిన “సట్టం ఓరు ఇరుత్తారై” అనే తమిళ సినిమాకు రీమేక్. ఇది తెలుగులో కమర్షియల్ గా హిట్ అయింది.

పట్నం వచ్చిన పతివ్రతలు
“పట్టణక్కే బంధ పత్ నియారు” అనే కన్నడ సినిమాకు రీమేక్ “పట్నం వచ్చిన పతివ్రతలు”. ఈ సినిమాలో చిరంజీవి, మోహన్ బాబు, రాధిక, గీత కీలక పాత్రల్లో కనిపించారు.

యమకింకరుడు
డర్టీ హ్యారీ, మ్యాడ్ మ్యాక్స్ సినిమాల ప్రేరణతో యమకింకరుడు మూవీని రూపొందించారు. అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రంలో చిరంజీవి హీరోగా నటించగా, రాధిక హీరోయిన్ గా కనిపించింది.

అభిలాష
హాలీవుడ్ మూవీ “ది మాన్ హూ డేర్డ్” సినిమాను ఆధారంగా చేసుకుని వీరేంద్ర నాధ్ రచించిచన “అభిలాష”  నవల ఆధారంగా ఈ మూవీని మూవీ తెరకెక్కించారు. దీనికి కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించగా, చిరంజీవి, రాధిక కలిసి నటించారు.

ఖైదీ
“ఫస్ట్ బ్లడ్” అనే సినిమా ప్రేరణతో కోదండ రామిరెడ్డి “ఖైదీ” మూవీని తెరకెక్కించారు. ఈ మూవీతో చిరంజీవి దశ తిరిగిపోయింది. ఆయన స్టార్ హీరోల లిస్ట్ లో చేరిపోయారు.

వీటితో పాటు హీరో, దేవాంతకుడు, ఇంటిగుట్టు, నాగు, చిరంజీవి, అడవి దొంగ, విజేత, వేట, దొంగ మొగుడు, ఆరాధన, చక్రవర్తి, పసివాడి ప్రాణం, ఖైదీ నెంబర్ 786, త్రినేత్రుడు, రాజా విక్రమార్క, స్టువర్టుపురం పోలీస్ స్టేషన్, ఘరానా మొగుడు, మెకానిక్ అల్లుడు, ముగ్గురు మొనగాళ్లు, ఎస్పీ పరశురాం, ది జెంటిల్మెన్, హిట్లర్, స్నేహం కోసం, మృగరాజు, ఠాగూర్, అంజి, శంకర్ దాదా ఎంబిబిఎస్, శంకర్ దాదా జిందాబాద్, ఖైదీ నెంబర్ 150, గాడ్ ఫాదర్, భోళా శంకర్… కెరీర్ మొదటి నుంచి రీసెంట్ టైం వరకు చిరంజీవి నటించిన రీమేక్ మూవీస్ ఇవే.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు