Prashant Varma: బన్నీని లైన్ లో పెట్టేసారుగా.. విజువల్ వండర్ తో..!

Prashant Varma.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కో డైరెక్టర్ కు ఒక్కో ధోరణి ఖచ్చితంగా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ అన్నట్టు.. సీనియర్ డైరెక్టర్లు కూడా ముందుకు వెళుతూ ఉన్నారు. కానీ యంగ్ డైరెక్టర్లు మాత్రం సరికొత్త కాన్సెప్ట్లతో సరికొత్త గా ఆలోచిస్తూ ముందుకు వెళుతున్నారు అనడంలో ఇలాంటి సందేహాలు లేవు.. అలాంటి వారిలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా ఒకరిని చెప్పవచ్చు. అఆ, కల్కి, జాంబిరెడ్డి, హనుమాన్ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రతి సినిమాను కూడా వైవిధ్యమైన కథాంశం తో తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ వర్మ.

Prashant Varma:As the bunny is put in the line.. with visual wonder..!
Prashant Varma:As the bunny is put in the line.. with visual wonder..!

అదే సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా మారుస్తుంది..

ప్రశాంత్ వర్మ డైరెక్టర్ కాకముందు నుంచి కూడా ఎన్నో షార్ట్ ఫిలిం లను చాలా డిఫరెంట్ గా చేసేవారని తెలుస్తోంది. అలా నెమ్మదిగా డైరెక్టర్ గా అవకాశం సంపాదించుకున్నారు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ఆ ఇంటర్వ్యూలో పలు విషయాలను తెలియజేశారు.. ముఖ్యంగా తనకు రొటీన్ సినిమాలు చేయడం అంటే అసలు నచ్చదని.. ఎప్పుడూ కూడా డిఫరెంట్ జోన్ల నేపథ్యంలో సినిమాలను చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని.. అందుకే తనకు అలా వెళ్లడమే ఇష్టం అంటూ తెలియజేశారు. ప్రస్తుతం అయితే తాను జై హనుమాన్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు.

ప్రశాంత్ వర్మ నెక్స్ట్ టార్గెట్ అల్లు అర్జున్..

జై హనుమాన్ సినిమా అయిపోయిన వెంటనే అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయాలని ప్రయత్నం చేస్తున్నామని తెలియజేశారు ప్రశాంత్ వర్మ.. అందుకోసం అల్లు అర్జున్ ని కలిసి ఒక లైన్ ను కూడా తాను వినిపించినట్లుగా తెలుస్తోంది.. తనకి కూడా ఆ లైన్ బాగా నచ్చడంతో జై హనుమాన్ సినిమా షూటింగ్ పూర్తి అయిపోయిన వెంటనే పూర్తి స్క్రిప్ట్ ని సిద్ధం చేసి అల్లు అర్జున్ కి వినిపించబోతున్నట్లు తెలుస్తోంది. విజువల్ వండర్ గా ఈ సినిమా రాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా సుకుమార్ తో కలిసి పుష్ప-2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

క్యూ కడుతున్న హీరోలు..

ఏది ఏమైనా మొత్తానికి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నారని అభిమానులకు తెలియగానే చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారు. వాస్తవానికి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ కు ఎంతోమంది హీరోస్ కూడా డేట్లు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు.. ముఖ్యంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చాలా తక్కువ బడ్జెట్ లోనే సినిమాలను తెరకెక్కిస్తూ బెస్ట్ అవుట్ పుట్ ని ఇస్తూ ఉన్నారు. అందుకే డైరెక్టర్ తో పనిచేయడానికి చాలామంది హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో ఎంతమంది హీరోలు సినిమాలు చేస్తారో చూడాలి.. డైరెక్టర్ గా ప్రశాంత్ వర్మ ఎలా ఎదుగుతారో చూడాలి మరి. మొత్తానికి అయితే యంగ్ డైరెక్టర్లు ఇప్పుడు విభిన్నమైన జోనర్లను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు .

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు