Vishal: ధోనీ అప్పులు వింటే షాక్.. హీరో ఓపెన్ కామెంట్స్.. !

Vishal..మహేంద్రసింగ్ ధోని.. ఈ పేరు వినగానే భారతీయులందరికి దిగ్గజ క్రికెటర్ గుర్తుకు వస్తారు.. ఇప్పటికీ కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న క్రికెటర్ గా మహేంద్ర సింగ్ ధోని మంచి పేరు సంపాదించారు.. తనదైన స్టైల్ లో ఫినిషింగ్ ఇస్తూ.. ఇండియాకి ఎన్నో విజయాలను కూడా అందించారు.. ఐపీఎల్ లో కూడా తన సత్తా చాటుతూ దూసుకుపోతున్నారు మహేంద్రసింగ్ ధోని. ఇలాంటి ధోని గురించి ప్రముఖ కోలీవుడ్ హీరో విశాల్ పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.

Vishal: Shocked to hear Dhoni's debts.. Hero open comments.. !
Vishal: Shocked to hear Dhoni’s debts.. Hero open comments.. !

మహేంద్రసింగ్ ధోని పై విశాల్ కామెంట్స్..

హీరో విశాల్ టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విశాల్ తాను నటించిన రత్నం సినిమా ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్ లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ హరి దర్శకత్వం వహించగా.. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు. విశాల్ మీడియాతో మాట్లాడుతూ.. లెజెండరీ క్రికెట్ మహేంద్రసింగ్ ధోని పైన పలు విషయాలను తెలియజేశారు.. విశాల్ మాట్లాడుతూ.. నేను ఎలాంటి వివాదాల జోలికి వెళ్ళను.. కేవలం నిజాలు మాత్రమే చెబుతాను.. అవి వివాదంగా మారుతూ ఉంటాయని తెలిపారు విశాల్. అయితే క్రికెట్ దిగ్గజం ధోని సిక్స్ లు కొడితే విజిల్స్ వేస్తున్నాము.. కానీ ఆయన కూడా సినిమాలు తీశారు. వెళ్లి ఆయన దగ్గర మైకు పెట్టి అడగండి ..ఎంత పెట్టుబడి పెట్టారు.. ఎంత వచ్చిందో.. అప్పుడు అందరికీ తెలుస్తుంది.. నిజం చెప్తే ఎవరికైనా వినడానికి కష్టంగానే ఉంటుంది.. ఆ బాధ భరిస్తున్నప్పుడే అసలు విషయం తెలుస్తుందని చెప్పారు విశాల్.. ఎవరు ఏమనుకున్నా తనకు చెప్పాలనిపించింది చెప్పానంటూ వెల్లడించారు.

నిజం చెప్పిన వివాదంగానే చూస్తారు..

తాను కూడా ఇండస్ట్రీలో ఎదగడానికి ఎంతో కష్టపడ్డానని .. తనకు కూడా ఊరికే డబ్బులు రావని.. మూడు పూటల భోజనం కోసం చాలా కష్టపడాల్సి ఉంటుందంటూ తెలిపారు. చాలామందికి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైనా విషయాలు మాట్లాడితే ఎప్పుడూ వివాదంగానే చూస్తారు.. కానీ అందులో ఉన్న నిజాన్ని తెలుసుకున్నప్పుడు ఆ విషయం కరెక్ట్ అని అందరూ అప్పుడు అనుకుంటారు అంటూ విశాల్ తెలిపారు. తనకు రెడ్ కార్డ్ ఇచ్చిన సమయంలో.. చాలా మంది విశాల్ పని అయిపోయింది అని అనుకున్నారు. కానీ తాను మాత్రం పని పాట లేని వాళ్ళు ఇలాంటివి పుట్టిస్తూ ఉంటారని.. సినిమా తీసే వాళ్ళు మాత్రం ఇలాంటి కామెంట్స్ చేయాలనుకోరని తెలిపారు.

- Advertisement -

నిర్మాతలతో ప్రాపర్టీ కొనమని చెప్పాను..

రెడ్ కార్డ్ , గ్రీన్ కార్డు వంటివి సినిమాకి సంబంధించిన విషయాలు కావని కూడా వెల్లడించారు. కోటి నుంచి నాలుగు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే చిన్న చిన్న నిర్మాతలకు సైతం ఈ ఏడాది డిసెంబర్ వరకు పరిస్థితి బాగాలేదని.. నిర్మాతలకు ఆ డబ్బుతో ఏదైనా ప్రాపర్టీ కొనమని చెప్పాను.. అది కూడా వివాదంగా చూశారు.. అంతేకాకుండా విశాల్ ఇలా ఎలా చెబుతాడు.. వాడికి అంత ధైర్యమా అంటూ చాలామంది హేళన చేశారని చెప్పారు. ప్రతి శుక్రవారం కూడా ఎన్నో సినిమాలు విడుదలవుతాయి.. అందులో తాను మాట్లాడిన మాట నిజమో కాదో వాళ్ళని అడగండి అంటూ తెలిపారు విశాల్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు