Reba Monica John: టాలీవుడ్ లోనే సెటిల్ అయ్యేలా రెబ మోనికా ప్లాన్..

Reba Monica John : టాలీవుడ్ లో ఏ హీరోయిన్ కైనా ఒక్క హిట్ వచ్చిందంటే చాలు తెలుగు నిర్మాతలు నెత్తిన పెట్టేసుకుంటారు. వరుస అవకాశాలు ఇస్తూ టాలీవుడ్ లో మంచి భవిష్యత్ ఇస్తారు. అలాగే రెండు మూడు ప్లాపులు పడ్డా కనికరం లేకుండా నెట్టేసినంత పని కూడా చేస్తారు. ఇక కొత్త హీరోయిన్లకైతే మంచి గ్లామర్ షో చేయగలిగి, కాస్త నటన లో టాలెంట్ ఉన్న వాళ్లయితే చాలు వాళ్లపై మేకర్స్ కన్ను ఎప్పుడూ ఉంటుంది. అలాంటి హీరోయిన్లకు కాస్త లేట్ అయినా సరే టాలీవుడ్ లో అవకాశాలు ఖచ్చితంగా వస్తుంటాయి. అయితే ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేది మాత్రం చాలా తక్కువ మంది హీరోయిన్లే. అలాంటి వాళ్లలో రెబ మోనికా జాన్ కూడా చేరాలనుకుంటుంది. చూస్తుంటే టాలీవుడ్ లోనే ఈ అమ్మడికి సెటిల్ అయ్యేలా రాసిపెట్టి ఉందని లెక్కలు చెప్తున్నాయి.

టాలీవుడ్ లోనే అసలైన బ్రేక్?

లాస్ట్ ఇయర్ సామజవరగమన సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రెబ మోనికా జాన్ బెంగుళూరు కి చెందిన అమ్మాయి. అయితే ఈ హీరోయిన్ అంతకు ముందే తమిళ, మలయాళ భాషల్లో నటించడం జరిగింది. కానీ ఆ సినిమాల్లో అన్నీ సైడ్ రోల్స్, సెకండ్ లీడ్ రోల్స్ వచ్చాయి. మెయిన్ లీడ్ గా చేసిన ఒకటి రెండు సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి. ఇక టాలీవుడ్ లో లాస్ట్ ఇయర్ శ్రీ విష్ణు నటించిన సామజవరాగమన సినిమా తో మెయిన్ హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోగా, మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టి పాస్ అయింది. అయితే ఇప్పటివరకు మళ్ళీ మరో తెలుగు సినిమాలో నటించలేదు ఈ అమ్మడు. కారణమేంటో తెలీదు గాని తెలుగు లో కొన్ని ఆఫర్లు వచ్చినా హోల్డ్ లో పెట్టిందట. అయితే ఇప్పుడు మళ్ళీ హిట్ పెయిర్ ని రిపీట్ చేస్తూ మరో తెలుగు సినిమాలో నటించబోతుంది రెబా మోనికా జాన్. అది కూడా శ్రీ విష్ణు సినిమాలోనే.

ఇక్కడే సెటిల్ అయ్యే ఛాన్స్?

శ్రీ విష్ణు హీరోగా కొత్త దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో సందీప్ గుణ్ణం నిర్మించబోయే సినిమాలో రెబ మోనికా హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాతో పాటు మరో మీడియం రేంజ్ హీరో సినిమాలోనూ ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే రెబ కి ఇప్పటి వరకు సామజవరగమన కి మించిన హిట్ దక్కలేదు. ఇతర సౌత్ భాషలన్నింటిలోనూ ఈ అమ్మాయి డిజాస్టర్లు చవి చూసింది. కాబట్టి తెలుగులో మళ్ళి శ్రీ విష్ణు సినిమా గనుక క్లిక్ అయి మరో హిట్టు బొమ్మ పడిందంటే ఈ ఇండస్ట్రీ లోనే పాగా వేసేలా ఈ కన్నడ బ్యూటీ ప్లాన్ చేసుకుంటుందట. పైగా కెరీర్ బిగినింగ్ లో తెలుగు లో హీరోయిన్లకు వచ్చినన్ని ఆఫర్లు, రెమ్యూనరేషన్లు ఇతర ఇండస్ట్రీలో ఇవ్వరు. అందుకని టాలీవుడ్ పైనే ఈ అమ్మడి కన్ను ఉన్నట్టు తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు