Prabhas Luxury Life : ప్రభాస్ లగ్జరీ లైఫ్ చూస్తే నోరు వెళ్ళబెట్టాల్సిందే… పెట్టుబడులు కూడా అదే రేంజ్ లో

Prabhas Luxury Life: రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ లోని రిచెస్ట్ హీరోలలో ఒకరన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పాన్ ఇండియా రేసులో నెంబర్ 1 హీరోగా కొనసాగుతున్న ప్రభాస్ లగ్జరీ లైఫ్ చూస్తే ఎవరికైనా అసూయ కలగక మానదు. మరి ఇంతకీ ప్రభాస్ నెట్ వర్త్ ఎంత? ఆయన ఎక్కడెక్కడ పెట్టుబడులు పెడతారు? అనే ఆసక్తికరమైన విషయంలోకి వెళ్తే…

ప్రభాస్ రెమ్యూనరేషన్…

బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే. ఆ సినిమాతో పాటే ఆయన క్రేజ్, రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరిగిపోయాయి. అప్పట్లో 100 కోట్ల పారితోషకం అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం 250 కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం. ఆయన కేవలం సినిమా ద్వారా మాత్రమే కాకుండా పలు బ్రాండ్ ఎండార్స్ మెంట్ల ద్వారా కూడా భారీగా సంపాదిస్తారు. ప్రభాస్ ఒక్కో బ్రాండ్ ఎండార్స్మెంట్ కోసం 60 కోట్లు పారితోషకంగా తీసుకుంటారని సమాచారం.

ప్రభాస్ దగ్గర లగ్జరీ కార్లు…

ప్రభాస్ గ్యారేజీలో అత్యంత కాస్ట్లీయస్ట్ కార్లు కొలువుదీరాయి. ఒక్కో కారు విలువ కోటి రూపాయలకు తక్కువ ఉండక పోవడం విశేషం.
1. రేంజ్ రోవర్ స్పోర్ట్స్ – ఈ రేంజ్ రోవర్ ధర రూ. 1 కోటి
2. బిఎండబ్ల్యూ సెవెన్ సిరీస్ – ఈ కారు ధర రూ. 2 కోట్లు
3. మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ – ఈ కారు ధర రూ. 2 కోట్లు
4. జాగ్వార్ XJL పోర్ట్ ఫోలియో – ఈ సూపర్ కారు ధర రూ, 1 కోటి
5. రోల్స్ రాయల్స్ ఫాంటమ్ – దేశంలోనే అతి తక్కువ మంది సెలెబ్రిటీల దగ్గర ఉండే అత్యంత కాస్ట్లీయెస్ట్ కారు ఇది. దీని ధర రూ.8 కోట్లు.

- Advertisement -

ప్రభాస్ పర్సనల్ ఇన్వెస్ట్మెంట్…

రెబల్ స్టార్ ఇలా సినిమాల ద్వారా కష్టపడి సంపాదించిన డబ్బునంతా రియల్ ఎస్టేట్, రెంటల్స్ వంటి వాటిలో పెట్టుబడి పెడతారు. ఇప్పటిదాకా ఆయన పలు బిజినెస్ లలో ఏకంగా 200 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. ఆయన బిజినెస్ లు దుబాయ్, స్పెయిన్ వంటి దేశాల్లో ఉన్నాయి. ఇక హైదరాబాద్ లో ఆయనకు విలాసవంతమైన ఇల్లు ఉంది. దీని ధర 60 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం.

ఇంస్టాగ్రామ్ లో ప్రభాస్ మైండ్ బ్లోయింగ్ ఫాలోయింగ్

సోషల్ మీడియా ద్వారా కూడా స్టార్స్ భారీగా సంపాదిస్తారన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ప్రభాస్ విషయానికి వస్తే ఆయనకు ఇంస్టాగ్రామ్ లో 11.7 మిలియన్ ఫాలోవర్లు ఉండగా, ఒక్కో సోషల్ మీడియా పోస్ట్ కోసం ప్రభాస్ 2 కోట్లు వసూలు చేస్తాడు. ఇక ప్రభాస్ టోటల్ నెట్ వర్త్ 300 కోట్లు అని సమాచారం. ఇక ఇవి కాకుండా ప్రభాస్ దగ్గర అత్యంత కాస్ట్లీ వాచ్ కలెక్షన్ కూడా ఉంది. ఒక్కో ఈవెంట్ కు ఒక్కో వాచ్ ధరించి కన్పిస్తాడు ప్రభాస్. ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు ప్రభాస్ రాజు నిజంగా రాజేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు