Pushpa The Rule : పుష్ప కోసం సింగం వెనకడుగు?

Pushpa The Rule : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ చిత్రాల్లో పుష్ప ది రూల్ ఒకటని తెలిసిందే. ఈ సినిమా కోసం ఒక్క టాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా వైడ్ గా ప్రేక్షకుల్లో భారీ డిమాండ్ ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమా కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. బాలీవుడ్ లో కనీసం ప్రమోషన్స్ కూడా లేకుండా విడుదలైన పుష్ప ది రైజ్ అప్పట్లోనే 110 కోట్లకి పైగా భారీ కలెక్షన్లను అందుకుందన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వెయ్యి కోట్లే లక్ష్యంగా పుష్ప మేకర్స్ పుష్ప రెండో భాగాన్ని దించుతున్నారు. ఇక షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఇక ఈ సినిమాకి సంబంధించి మరో రెండు పాటలు, రెండు సీన్లు తెరకెక్కిస్తే మొత్తం పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి వెళ్తుందట. ఇక ఈ సినిమా ఆగస్ట్ 15 విడుదల అవుతుందని తెలిసిందే. ఆ డేట్ ని ఎట్టి పరిస్థితుల్లో మార్చేది లేదని పుష్ప ది రూల్ టీమ్ పదే పదే స్పష్టం చేస్తున్న తరుణంలో దాని స్థానంలో రావాలని చూస్తున్న ఇతర పాన్ ఇండియా సినిమాలు మెల్లగా వెనుకడుగు వేస్తున్నాయి.

సింగం వెనకడుగు?

అయితే పుష్ప కి పోటీగా రిలీజ్ డేట్ ప్రకటించి వెనక్కి తగ్గుతున్న సినిమాల్లో ముఖ్యంగా సింగం అగైన్ కూడా ఉంది. అజయ్ దేవగన్ హీరోగా భారీ బడ్జెట్ తో రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పోలీస్ మల్టీస్టారర్ షూటింగ్ గత కొన్ని నెలలుగా నాన్ స్టాప్ గా జరుగుతూనే ఉంది. పుష్ప 2కి ఎంత క్రేజ్ ఉన్నా ఉత్తరాది మార్కెట్లలో అజయ్ క్రేజ్ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని ముందు మేకర్స్ భావించారు. కానీ లేటెస్ట్ గా రిలీజ్ అయిన పుష్ప ది రూల్ టీజర్ భారీ రెస్పాన్స్ తో సింగం వెనక్కి తగ్గిందని తాజాగా వార్తలు వస్తున్నాయి. త్వరలో ఇండిపెండెన్స్ డే రేసు నుంచి సింగం అగైన్ తప్పుకోవడం ఖాయమేనని బాలీవుడ్ నుండి అప్డేట్స్ వస్తున్నాయి. అధికారికంగా ప్రకటించలేదు కానీ, ఇంకా ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి చాలా పనులు పెండింగ్ లోనూ ఉండటంతో దీపావళికి వెళ్లే దిశగా ప్లానింగ్ మార్పు జరుగుతోందని తెలిసింది. పైగా దీనికి VFX వర్క్ చాలా ఉందట. ఎంత ఖాకీ చొక్కా కథలు తీసినా రోహిత్ శెట్టి ఫైట్లు ఫిజిక్స్ ని ఛాలెంజ్ చేసే రేంజ్ లో ఉంటాయి. ఈసారి వాటి మోతాదు ఎక్కువగా ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేయాల్సి వస్తోందని సమాచారం.

సోలో రిలీజ్ కోసం పుష్ప..

అయితే పుష్ప ది రూల్(Pushpa The Rule) మేకర్స్ కూడా సోలో రిలీజ్ కోసమే వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎంత కంటెంట్ పై నమ్మకమున్నా వెయ్యి కోట్ల వసూళ్లు రావాలంటే అన్ని భాషల కలెక్షన్లు తప్పనిసరి. పైగా హిందీ వెర్షన్ కీలకం. అందువల్ల మేకర్స్ టీం ఆ టైం కి పలు సినిమాలు తెలుగులో అయితే రిలీజ్ కానివ్వకుండా వేరే డేట్ ప్లాన్ చేసుకునేలా చేస్తున్నారట. ఇక హిందీ పరంగా పాన్ ఇండియా రేంజ్ లో పుష్ప 2కున్న ప్రధానమైన అడ్డంకి అయితే తొలగినట్టే. మొదటి భాగం తెచ్చిన క్రేజ్ దృష్ట్యా హిందీ నుంచి హక్కుల కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. ముఖ్యంగా ఎగ్జిబిటర్లు కెజిఎఫ్ ని మించిన వసూళ్ల సునామిని దీనికి చూడొచ్చని నమ్మకంగా ఉన్నారు. ఇటీవలే రిలీజైన టీజర్ లో అల్లు అర్జున్ గెటప్ చూసి షాక్ తిన్న విశ్లేషకులు ఈ మాస్ కి బాలీవుడ్ జనాలు మైండ్ బ్లాంక్ కావడం ఖాయమని ఫిక్సయిపోయారు. ఇక సింగం రిలీజ్ దివాళి కి ఫిక్స్ అని ఆల్మోస్ట్ తేలిపోయినట్టే అని తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు