Happy Days Re release : నీ సినిమా రీ రిలీజ్ నీకు తెలియదా? వరుణ్ సందేశ్ పై సెటైర్లు

Happy Days Re release : యంగ్ స్టార్ వరుణ్ సందేశ్ ఓ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ హ్యాపీడేస్ రీ రిలీజ్ కు రెడీ అవుతుంది. కానీ తాజాగా జరిగిన ఓ ఈవెంట్లో ఈ రీ రిలీజ్ గురించి ప్రశ్నించగా, వరుణ్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ పై సెటైర్లు వేస్తున్నారు నెటిజెన్లు. నీ సినిమా రీ రిలీజ్ గురించి నీకే తెలీదా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

రీ రిలీజ్ కు హ్యాపీ డేస్ రెడీ

నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ హ్యాపీ డేస్. 2007లో రిలీజ్ అయిన ఈ మూవీ కల్ట్ క్లాసిక్ అని చెప్పొచ్చు. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న హ్యాపీడేస్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్లే రాబట్టింది. ఇక ఈ మూవీ వరుణ్ సందేశ్, నిఖిల్ సిద్ధార్థ, తమన్నా వంటి స్టార్ల కెరీర్లోనే బెస్ట్ మూవీ గా నిలిచింది. ఈ స్టార్స్ అంతా అప్పుడప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన న్యూ కామర్స్ అయినప్పటికీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన టేకింగ్ తో వెండి తెరపై మ్యాజిక్ క్రియేట్ చేసి అందరిని ఫిదా చేశాడు. అలాగే మిక్కీ జే మేయర్ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ ఎవర్ గ్రీన్ ట్రెండ్ సెట్టింగ్ యూత్ ఫుల్ మూవీ మరోసారి థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. ఏప్రిల్ 19న హ్యాపీడేస్ మూవీ రీ రిలీజ్ కాబోతోంది. కానీ ఈ విషయం గురించి వరుణ్ సందేశ్ కు తెలియదట.

వరుణ్ సందేశ్ షాకింగ్ ఎక్స్ప్రెషన్

తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన శబరి మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కు వరుణ్ సందేశ్ గెస్ట్ గా హాజరయ్యారు. అందులో భాగంగానే విలేకరులు అడిగిన ప్రశ్నలకు టీం సమాధానాలు ఇచ్చారు. ఇక వరుణ్ సందేశ్ వంతు రాగానే హ్యాపీ డేస్ రీ రిలీజ్ ను థియేటర్లో చూడాలనుకుంటున్నారా ? అనే ప్రశ్న ఎదురయింది. కానీ వరుణ్ సందేశ్ ఆ ప్రశ్నకు సమాధానం ఏమీ చెప్పకుండా తనకు తెలియదన్నట్టు మిన్నకుండిపోయారు. మరి ఇంతకీ వరుణ్ సైలెన్స్ కు అర్థం ఏంటి? ఆయన ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ మూవీ హ్యాపీడేస్ రీ రిలీజ్ అవుతోందని అతనికే తెలీదా? అంటూ సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

స్టార్ ను చేసిందే శేఖర్ కమ్ముల…

వరుణ్ సందేశ్ హ్యాపీడేస్ మూవీతో టాలీవుడ్ కు హీరోగా పరిచయమయ్యాడు. ఆయనకు శేఖర్ కమ్ముల ఫస్ట్ మూవీతోనే బ్రేక్ ఇచ్చి స్టార్ ను చేశారు. ఆ తర్వాత కొత్త బంగారులోకం కుర్రాడు సినిమాలతో సోలో హీరోగా యూత్ లో మంచి క్రేజ్ క్రియేట్ చేసుకున్నాడు. 2016లో హీరోయిన్ వితికను పెళ్లి చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత నుంచి వరుణ్ కు పెద్దగా అవకాశాలు ఏమీ రాలేదు. దీంతో బిగ్ బాస్ సీజన్ 3లో భార్యతో కలిసి అడుగు పెట్టాడు. సందీప్ కిషన్ హీరోగా నటించిన మైఖేల్ అనే మూవీలో వరుణ్ చివరి సారిగా సిల్వర్ స్క్రీన్ పై మెరిశాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు