SS Rajamouli : వార్నర్ తో దర్శకధీరుడు.. ఇది మామూలు కామెడీ కాదు భయ్యా!

SS Rajamouli : ప్రముఖ లెజెండరీ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఖ్యాతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఇప్పుడు రాజమౌళి అంటే తెలీని వారు లేరు. ఇక తెలుగు సినిమా పాటకు ఆస్కార్ అవార్డు వచ్చేలా చేయడంలో రాజమౌళి చేసిన కృషి వల్ల, ఆర్ఆర్ఆర్ కు వచ్చిన అంతర్జాతీయ ఖ్యాతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏ స్టార్ హీరోకి తీసిపోని రేంజ్ లో ఇంటర్నేషనల్ మార్కెట్ లో జక్కన్న బ్రాండ్ కున్న విలువ చిన్నది కాదు. ఇండియా లో శంకర్, సంజయ్ లీలా భన్సాలీ వంటి దర్శకులని మించి పాపులారిటీ ని సొంతం చేసుకున్న రాజమౌళి ఏ సినిమా చేసిన సెన్సేషనే. మామూలు గా రాజమౌళి నుండి సినిమా వస్తుందంటే హీరో ఎవరైనా అది రాజమౌళి సినిమా అనేస్తున్నారు. అంటే హీరోలకు ధీటుగా రాజమౌళి సొంతం చేసుకున్న క్రేజ్ అలాంటిది. అయితే అంతటి క్రేజ్, పాపులారిటీ ఉన్న రాజమౌళిని కార్పొరేట్ కంపెనీలు కూడా ఇప్పుడు సూపర్ గా వాడేసుకుంటున్నాయి.

వార్నర్ తో కలిసి..

అయితే తాజాగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించే ప్రముఖ క్రెడ్ సంస్థ తన క్రెడిట్ కార్డు అమ్మకాల కోసం రాజమౌళిని అంబాసడర్ గా తీసుకుంది. అక్కడితో ఆగకుండా ఆయనకు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ని జోడించింది. ఇక డేవిడ్ వార్నర్ కి ఇండియాలో ఉన్న ఫాలోయింగ్ కూడా మామూలు కాదు. అప్పట్లో డేవిడ్ వార్నర్ పెట్టే పోస్టులు చూసి వార్నర్ ఇండియా లో పుట్టాల్సిన వాడు అని ప్రశంసలు కురిపించారు నెటిజన్లు. ఇప్పటికి కూడా వార్నర్ పెట్టే పోస్టులలో ఇండియా కి సంబంధించిన ఫెస్టివల్స్ గాని, సినిమాలకి సంబంధించినవే ఎక్కువ ఉంటాయంటే అర్ధం చేసుకోవచ్చు. ఇక తాజాగా రాజమౌళి వార్నర్ కలయికలో రూపొందిన యాడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాన్సెప్ట్ కూడా వెరైటీగా డిజైన్ చేశారు. క్రెడ్ కార్డు లేని రాజమౌళి అది లేనందువల్ల మిస్సవుతున్న ప్రయోజనాలు పొందటం కోసం, వార్నర్ కు ఫోన్ చేస్తాడు. బదులుగా అతనో ఫేవర్ అడుగుతాడు. అదేంటంటే హీరోగా పెట్టి సినిమా తీయడం. తీరా ఒప్పుకున్నాక తెలుగు రాని వార్నర్ చిత్ర విచిత్రంగా నటించడం, రాజమౌళికి చుక్కలు చూపించడం జరిగిపోతాయి. ఇదంతా ఊహించుకున్న రాజమౌళి భయమేసి దీనికన్నా క్రెడ్ కార్డు తీసుకోవడమే ఉత్తమమని భావించి సరే చూద్దాం అని కాల్ కట్ చేస్తాడు.

- Advertisement -

ట్విట్టర్ లో పాన్ ఇండియా వైడ్ గా వైరల్..

ఇక రాజమౌళి వార్నర్ కలిసి చేసిన ఈ యాడ్ సోషల్ మీడియాలో ఇండియా వైడ్ గా వైరల్ అవుతోంది. మామూలుగానే మన పాటలకు డాన్సులతో రీల్స్ చేసే వార్నర్ తో ఇలాంటి క్రియేటివిటీ ప్లాన్ చేయడం బాగుంది. ఇక ఈ వీడియో తో వార్నర్ కి మరింత క్రేజ్ వచ్చిపడిందని అంటున్నారు నెటిజన్లు. ఇదిలా ఉండగా రాజమౌళి(SS Rajamouli ) కి కూడా చిన్నపాటి నెగిటివ్ కామెంట్స్ మహేష్ ఫ్యాన్స్ నుండి వస్తుంది. అదేంటో తెలిసిందే. రాజమౌళి మహేష్ బాబు తో చేస్తున్న సినిమా కోసం ట్విట్టర్ సాక్షి గా ఈ యాడ్ లో కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. యాడ్లు చేస్తున్నారు బాగానే ఉంది గాని మహేష్ తో సినిమా ఎప్పుడు మొదలు పెడుతున్నారు అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ బతిమిలాడుతున్నారు. ఎందుకంటే రాజమౌళి సినిమా అంటే రెండేళ్లు అంతకంటే ఎక్కువ కూడా టైం ఇవ్వాల్సి ఉంటుంది. మరి మహేష్ తో సినిమా స్టార్ట్ ఎప్పుడు చేస్తారని తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చుస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు