Dear : అనుకున్నదే జరిగింది..

Dear : కోలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ నుండి హీరోగా మారిన జివి ప్రకాష్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంత బిజీగా ఉన్నాడో ఇప్పుడు హీరోగా అంతకంటే బిజీగా ఉన్నాడు. అలాగని మ్యూజిక్ చేయడం మానేయలేదు. దేని దారి దానిదే అన్నట్టు పలు స్టార్ హీరోల సినిమాలకి మ్యూజిక్ కూడా అందిస్తున్నాడు. ఇక తాజాగా జివి ప్రకాష్, ఐశ్వర్య రాజేసష్ జంటగా డియర్ అనే సినిమాలో నటించారన్న సంగతి తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్, ఏసియన్ సంస్థలు సంయుక్తంగా తెలుగులో ఏప్రిల్ 12న డియర్ సినిమాను రిలీజ్ చేయడం జరిగింది. ఆ మధ్య నాగ చైతన్య వాయిస్ ఓవర్ ఇస్తూ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇక జివి ప్రకాష్ కుమార్, ఐశ్యర్య రాజేష్ జంటగా రూపొందిన ఈ సినిమా కథేంటో ట్రైలర్ చుస్తే మొత్తం తెలిసిపోయింది. ఈ సినిమా ఓ కోలీవుడ్ హిట్ మూవీ కి కాపీగా తెరకెక్కిందని అప్పట్లోనే ట్రోల్ చేసారు. తాజాగా థియేటర్లలోకి వచ్చిన డియర్ మూవీ టాక్ ఇలా ఉంది.

కాపీ పేస్ట్ అంటూ ట్రోలింగ్..

లేటెస్ట్ గా రిలీజ్ అయిన డియర్ మూవీ థియేటర్లలో రిలీజ్ అవగా, తమిళ్ లో బీలో యావరేజ్ టాక్ తెచ్చుకోగా, తెలుగులో పూర్తిగా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా కథలో మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక అమ్మాయి గురక. దాని చుట్టే లవ్ స్టోరీ, మ్యారేజ్, ఎమోషన్స్ అన్నీ పెట్టేశారు. ఈ సినిమా సంగీతం కూడా స్వయంగా జివి ప్రకాశే సమకూర్చుకున్న ఈ ఎంటర్ టైనర్ కు ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించాడు. కథ ప్రకారం అబ్బాయి లైట్ స్లీపర్. అమ్మాయికేమో పెద్ద శబ్దాలతో గురక పెట్టి ఎక్కువ సేపు నిద్రపోవడం అలవాటు. అలాంటి ఈ ఇద్దరూ ప్రేమించి తమ బలహీనతను దాచి పెట్టుకుని పెళ్లి చేసుకుంటారు. కట్ చేస్తే గుర్రు సౌండ్ తో కాపురం చేసే పెళ్ళాన్ని భరించలేనంటూ కుర్రాడు వీధికెక్కుతాడు. ఫైనల్ గా ఈ సమస్యకి పరిష్కారం దొరికిందా, వీళ్ళ కథ ఏమైంది అన్నది సినిమా కథ. సినిమా కాన్సెప్ట్ మొత్తం గుడ్ నైట్ కి కాపీ అని ఎవర్నడిగినా చెప్తారు. అక్కడ అబ్బాయి, ఇక్కడ అమ్మాయి అంతే తేడా. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే నెగిటివ్ రెస్పాన్స్ రాగా, సినిమా కంటెంట్, కామెడీ డ్రామా వేరేగా ఉంటుందని మేకర్స్ సమర్ధించుకున్నారు. కానీ ప్రేక్షకులు మాత్రం ఇది కాపీ గా రొటీన్ సినిమా గా డిసైడ్ చేసేసారు.

రొటీన్ టాక్ తో ఓపెనింగ్స్ కూడా నిల్..

ఇక డియర్ సినిమా ప్రీమియర్స్ తోనే అంతంత మాత్రమే అన్న టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమాకు నెగిటివ్ టాక్ తొందరగా స్ప్రెడ్ అయిపోయి ఓపెనింగ్స్ పై కూడా ప్రభావం చూపేలా చేసింది. కనీసం ట్రైలర్ లో కాన్సెప్ట్ రివీల్ చేయకుండా వేరేలా డిజైన్ చేసి ఉంటె ఓపెనింగ్స్ అయినా బాగా వచ్చేవి అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఇక ఈ సినిమా గురించి మాట్లాడాల్సిందేమి లేదని అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో మెయిన్ మైనస్ ఎమోషన్స్ అని సమాచారం. ఎందుకంటే ఎంత రొటీన్ కంటెంట్ తో వచ్చినా డ్రామా ఎలివేట్ అయితే ఓ మోస్తరుగా అదే ఛాన్స్ ఉంది. కానీ ఈ సినిమాలో ఏ రకంగానూ ఆ పాయింట్ కనిపించలేదని ఆడియన్స్ టాక్. ఏది ఏమైనా జివి ప్రకాష్ కి ఈ సినిమాతో గట్టి ప్లాప్ పడుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు