Bade Miyan Chote Miyan : 350 కోట్ల సినిమాకు ఫస్ట్ డే.. అందులో పది శాతం కూడా లేదాయె..

Bade Miyan Chote Miyan : బాలీవుడ్ లో ఈ వారం రంజాన్ కానుకగా రెండు క్రేజీ ప్రాజెక్టులు రిలీజ్ అయ్యాయన్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి అజయ్ దేవగన్ నటించిన మైదాన్ కాగా, మరొకటి అక్షయ్ కుమార్ టైగర్ ష్రాఫ్‌ కాంబినేషన్ లో వచ్చిన మల్టీ స్టారర్ ‘బడేమియా చోటేమియా’. ఇక బడే మియా చోటే మియా సినిమాను అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించాడు. ఇక చాలా రోజులుగా సరైన హిట్ లేక సతమతమవుతున్న ఈ హీరోలు ఈ మల్టీ స్టారర్ సినిమాతో తమ హిట్ కరువును తీర్చుకుందామని ఆశ పడ్డారు. ఐతే విడుదలకు ముందే చాలా నెగెటివిటీని ఎదుర్కొన్న ఈ సినిమా విడుదలయ్యాక అందరూ ఊహించినట్టే దారుణమైన టాక్‌ను తెచ్చుకుంది. సినిమా పది సినిమాలు కలిపి తీసినట్టు, పాత చింతకాయ పచ్చడి లా అందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇలా మార్నింగ్ షోలు పడ్డాయో లేదో, డిజాస్టర్ అని తేల్చేశారు ప్రేక్షకులు. ఇక ట్విట్టర్లో ‘డిజాస్టర్’ అనే హ్యాష్ ట్యాగ్ నిన్న టాప్‌లో ట్రెండ్ అయింది. ఆ హ్యాష్ ట్యాగ్‌ను క్లిక్ చేస్తే ‘బడేమియా చోటేమియా’ సినిమాకు సంబంధించిన పోస్టులే దర్శనమిస్తున్నాయి. 350కోట్లు భారీగా ఖర్చు పెట్టి యాక్షన్ సన్నివేశాలను స్టైల్‌గా, గ్రాండ్‌గా తీశారే తప్ప సినిమాలో విషయం లేదన్నది ప్రేక్షకులు చెబుతున్న మాట.

బడ్జెట్ కి ఓపెనింగ్స్ కి సంబంధమే లేదు..

ఇక బడే మియా చోటే మియా సినిమాలా ఇదే ఫార్మాట్లో బాలీవుడ్ లో కుప్పలు కుప్పలుగా సినిమాలు వచ్చాయని, లాస్ట్ ఇయర్ వచ్చిన జవాన్, పఠాన్, టైగర్ 3 అదే కాన్సెప్ట్ తో వచ్చాయని, మళ్ళీ ఎందుకు దించిందే దించుతున్నారని ఆడియన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. ఏది ఏమైనా సినిమా రీసెంట్ టైంలో భారీ కాంబో హైప్ నడుమ వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రంజాన్ లాంటి భారీ హాలిడే వీకెండ్ లో రిలీజ్ అయినా కూడా తర్వాత అంచనాలను అందుకోలేక పోయింది. ఇక ఈ సినిమాకు బీలో యావరేజ్ టాక్ సొంతం అవగా, మొదటి రోజు కలెక్షన్స్ పరంగా కూడా భారీ షాకిచ్చింది. మామూలుగా రంజాన్ పండగకి రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ సార్లు సల్మాన్ ఖాన్ సినిమాలు రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోసేవి. కానీ ఈ ఇయర్ సల్మాన్ సినిమా లేకపోవడంతో ఈ సినిమా బరిలోకి దిగగా ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించలేదు.

డిజాస్టర్ ఓపెనింగ్స్..

అయితే బడే మియా చోటే మియా(Bade Miyan Chote Miyan) రంజాన్ స్పెషల్ గా రిలీజ్ అవడంతో హాలిడే రోజున టాక్ ఎలా ఉన్నా మినిమం 80 నుండి 100 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ వస్తాయని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేసాయి. కానీ అనూహ్యంగా డిజాస్టర్ ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది ఈ సినిమా. మొదటి రోజు ఇండియాలో 15.7 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా 18.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను ఇండియాలో అందుకుంది. ఇక ఓవర్సీస్ లో 12.4 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సినిమా 31.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమె అందుకుంది. 350 కోట్ల మమ్మోత్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు అందులో కనీసం పది శాతం కూడా వసూలు చేయకపోవడం షాకే అని చెప్పాలి. ఇక సినిమా వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చూపిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు