Nani32 : సరికొత్తగా నాని.. ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్..

Nani32 : టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. లాస్ట్ ఇయర్ దసరా, హాయ్ నాన్న తో అటు మాస్, ఇటు క్లాస్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన ఈ హీరో ప్రస్తుతం మీడియం రేంజ్ హీరోల్లో టాప్ ఫామ్ లో కొనసాగుతున్నాడు. ఇక నాని తన తదుపరి సినిమాలపై కూడా ఫుల్లుగా ఫోకస్ పెట్టాడు. అదిరిపోయే కాంబినేషన్లలో వరుస సినిమాలు చేస్తూ బిజీ అయ్యాడు. గత కొన్నేళ్లలో కూడా నాని సినిమా అంటే మినిమం గ్యారెంటీ అని జనాలు ఫిక్స్ అయ్యారు.

రెండేళ్ల కింద వచ్చిన అంటే సుందరానికి అనుకోకుండా ప్లాప్ అయినా, ఆ తర్వాత ఓటిటి లో బ్లాక్ బస్టర్ అయి కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. అందుకే ఆ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ని రిపీట్ చేస్తూ అతని దర్శకత్వంలో మళ్ళీ ‘సరిపోదా శనివారం’ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా టీజర్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుని సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇదిలా ఉండగా నాని సుజీత్ కాంబోలో కూడా ఓ సినిమా తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే. ఎవరూ ఊహించని ఈ కాంబో నాని బర్త్ డే రోజు అనౌన్స్ అయి ట్రీట్ ఇచ్చారు. ఇక డివివి దానయ్య నిర్మాణంలో ఆల్రెడీ సరిపోదా శనివారం చేస్తున్న నాని, ఇప్పుడు వరుసగా అదే బ్యానర్ లో సుజీత్ సినిమా తెరకెక్కుతుంది.

సరికొత్తగా నాని.. ఫన్ గా..

ఇక నాని హీరోగా తెరకెక్కబోయే సుజీత్ సినిమాను డివివి దానయ్య మరియు కళ్యాణ్ దాసరి డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాని32 ని నిర్మించనున్నారు. ఇక స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లు సినిమాలు తీయడంలో స్పెషలిస్ట్ అయిన సుజీత్ క్రేజీ కథతో నానిని మెప్పించాడు. ఆ మధ్య రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ వీడియో లో నాని32 మూవీ కాన్సెప్ట్‌ ను మేకర్స్ తెలియచేయడం జరిగింది. సుజీత్ మార్క్ లో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ గానే ఈ సినిమా రూపొందనుందని వీడియో చూస్తే తెలుస్తుంది. ఇక ఆ అనౌన్స్ మెంట్ లో ఇంగ్లీష్ లో అహింసా మార్గంలో సాగే ఒక హింసాత్మక వ్యక్తి కథ ఈ సినిమా అని మేకర్స్ చెప్పడం జరిగింది. ఇక ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని 2025లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఎందుకంటే సుజీత్ ఓజి ఫినిష్ అయ్యాకే ఈ సినిమా మొదలు పెట్టనున్నాడని తెలుస్తుంది.

- Advertisement -

చాలా రోజుల తర్వాత నాని మార్క్.. లో యాక్షన్..

అయితే నాని ఈ మధ్య చేసిన సినిమాల్లో సినిమా జోనర్ ఉంటే పక్కా క్లాస్ గా ఉంటే, లేదా పక్కా మాస్ గా ఉంటుంది. కానీ అన్నీ మిక్స్ చేసిన కమర్షియల్ ఎంటర్టైనర్ చేసి చాలా రోజులయింది. ఆ మధ్య చేసిన V లాంటి సినిమాల్లో సీరియస్ గా కనిపిస్తే ప్రేక్షకులు అంతగా రెస్పాండ్ అవ్వలేదు. అందుకే ఈ సారి ఫన్ గా కనిపిస్తూనే కొత్తగా యాక్షన్ చేయబోతున్నాడట. నానితో సుజీత్ (Nani32) సినిమా “రన్ రాజా రన్” స్టైల్ లో ఫన్ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుందని సమాచారం. అంటే సుందరానికి లాంటి కామెడీ, లేదా దసరా తరహా యాక్షన్ సినిమాలు చేస్తోన్న నాని నుండి ఈసారి కంప్లీట్ ప్యాకేజ్ ఇవ్వబోతున్నాడట సుజీత్. ఈ సినిమా మొదలయ్యే లోపు నాని సరిపోదా శనివారం, అలాగే సుజీత్ ఓజి పూర్తి చేస్తారని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు