War 2 : ఇద్దరు కొరియోగ్రాఫర్లా… తారక్, హృతిక్ ను హ్యాండిల్ చెయ్యాలంటే ఆమాత్రం ఉండాల్సిందే

War 2 :మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ మొట్ట మొదటి సారి కలిసి నటిస్తున్న క్రేజీ మూవీ వార్ 2. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ లో ఎన్టీఆర్, హృతిక్ కలిసి డాన్స్ అదరగొట్టబోతున్నారని, వీళ్ళిద్దరి కోసం ఏకంగా ఇద్దరు కొరియోగ్రాఫర్లను మేకర్స్ రంగంలోకి దించబోతున్నారని సమాచారం.

ఇద్దరు హీరోలు… ఇద్దరు కొరియోగ్రాఫర్లు

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వార్ 2 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ కోసం ప్రస్తుతం ఎన్టీఆర్ ముంబైలోనే ఉన్నారు. ఇప్పటికే ఈ మూవీలో ఎన్టీఆర్ లుక్ కు సంబంధించిన పిక్స్ లీకైన విషయం తెలిసిందే. అందులో ఆయన హెయిర్ స్టైల్ ను కవర్ చేస్తూ టోపీని ధరించి కనిపించాడు. ఇక ఈరోజు ఉదయమే ఈ ఇద్దరు స్టార్ హీరోలు టెస్ట్ షూట్ లో పాల్గొన్నారు.

పది రోజుల పాటు జరగనున్న సుదీర్ఘ షెడ్యూల్ లో ఎన్టీఆర్ పాల్గొనబోతున్నాడని సమాచారం. ఇక ఈ షెడ్యూల్ లో హృతిక్, ఎన్టీఆర్ మద్య భారీ యాక్షన్ సన్నివేశాలను మేకర్స్ చిత్రీకరించబోతున్నారు. అలాగే ఇదే షెడ్యూల్లో మరో క్రేజీ ఇద్దరు హీరోలపై ఓ భారీ సాంగ్ ను తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారట. అటు హృతిక్, ఇటు ఎన్టీఆర్ ఇద్దరూ క్రేజీ డాన్సర్లే కావడంతో ఈ స్పెషల్ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని భావిస్తున్నారు తారక్ ఫ్యాన్స్. అయితే ఈ పాట కోసం ఏకంగా ఇద్దరు కొరియోగ్రాఫర్లను రంగంలోకి దింపుతున్నారట. బాలీవుడ్ నుంచి గణేష్ మాస్టర్, టాలీవుడ్ నుంచి జానీ మాస్టర్ ఈ హీరోలను కొరియోగ్రాఫ్ చేయబోతున్నారని సమాచారం. ఇంకేముంది వీరిద్దరూ కలిసి డాన్స్ చేస్తే స్టేజ్ బద్దలవ్వడం పక్కా. అలాగే ఆస్కార్ విన్నింగ్ సాంగ్ నాటు నాటుకు మించి ఈ సాంగ్ ఉండబోతుందని ఇప్పటి నుంచే సినిమాపై మరింతగా అంచనాలు పెంచేస్తున్నారు. ఇక ఇద్దరు కొరియోగ్రాఫర్లు కొరియోగ్రఫీ చేయబోతున్నారని అనే వార్తలు విన్న అభిమానులు ఈ ఇద్దరు స్టార్స్ ను మేనేజ్ చెయ్యాలంటే ఆమాత్రం ఉండాల్సిందే అంటున్నారు.

- Advertisement -

“వార్”కు ఇలా జరగలేదు

గతంలో తెరపైకి వచ్చిన వార్ మూవీకి సీక్వెల్ గా వార్ 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మొదటి భాగంలో హృతిక్, టైగర్ ష్రాఫ్ కలిసి స్క్రీన్ పై కనిపించారు. అయితే అందులో ఇలా ఇద్దరు కొరియోగ్రాఫర్ లను తీసుకోలేదు. కానీ సీక్వెల్ లో మాత్రం హృతిక్, ఎన్టీఆర్ లను సపరేట్ సపరేట్ కొరియోగ్రాఫర్లు డాన్స్ స్టెప్పులు వేయిస్తుండడం విశేషం. కాగా వార్ 2 మూవీ కోసం ఏకంగా 250 కోట్ల బడ్జెట్ ను కేటాయిస్తోంది యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్. ఇండియాలోనే బెస్ట్ డాన్సింగ్ స్టార్స్ అయిన ఎన్టీఆర్, హృతిక్ ళుం ఒకే ఫ్రేమ్లో చూడడానికి అభిమానులు ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ఇందులో హృతిక్ కు ధీటుగా కనిపించడానికి జిమ్ లో తీవ్రమైన కసరత్తులు చేస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు