Heroines Villain role: రాక్షసత్వం సృష్టించిన హీరోయిన్స్ వీళ్ళే..!

సాధారణంగా ఎవరైనా సరే పాజిటివ్ రోల్స్ లో నటించి మెప్పించడం సులభమే అయితే నెగిటివ్ రోల్స్ లో మెప్పించడం అంత సులభమైన పని కాదు.. అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం ఇలా నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ కి ప్రాణం పోసి.. తమ నటనతో ప్రేక్షకులను అబ్బుర పరిచారు.. మరైతే విలన్ లుగా తమ నటనతో రాక్షసత్వం సృష్టించిన హీరోయిన్స్ గురించి ఇప్పుడు చూద్దాం.

రమ్యకృష్ణ:
లేడీ విలన్ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు రమ్యకృష్ణ.. హీరోలకు పోటీ ఇస్తూ తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. విలన్ గానే కాదు ఎటువంటి పాత్ర ఇచ్చినా సరే అందులో పరకాయ ప్రవేశం చేసి నటిస్తుంది అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా రమ్యకృష్ణ విలనిజానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సినిమా నరసింహ. ఈ సినిమాలో అద్భుతమైన నటనతో అందరిని ఆకట్టుకుంది. అలాగే రిపబ్లిక్ సినిమాలో కూడా రమ్యకృష్ణ విలన్ పాత్ర పోషించారు

వరలక్ష్మి శరత్ కుమార్:
రమ్యకృష్ణ తర్వాత ఆ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించిన ఏకైక నటి వరలక్ష్మి శరత్ కుమార్ .. ఈ మధ్యకాలంలో ఎక్కువగా నెగిటివ్ రోల్ లో చేస్తున్న ఈమె.. క్రాక్, వీరసింహారెడ్డి, కోట బొమ్మాలి పీఎస్ తోపాటు మరికొన్ని సినిమాలలో విలన్ గా నటించి మెప్పించింది.

- Advertisement -

కాజల్ అగర్వాల్:
చందమామ లా యువత మనసులు దోచుకున్న కాజల్ అగర్వాల్ సీత అనే సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది.. అయితే ఈ సినిమా ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.

సమంత:
తెలుగులో స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న సమంత విక్రమ్ యూబీపత్తుఎంద్రాకుల్లం అనే సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది.

సౌందర్య:
దివంగత నటి సౌందర్య కూడా శ్రీకాంత్ హీరోగా నటించిన నామనసిస్తారా అనే సినిమాలో కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది.

త్రిష:
దాదాపు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 17 సంవత్సరాలకు పైగానే అవుతున్నా.. ఇంకా తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈమె ధర్మ యోగి సినిమాలో నెగిటివ్ రోల్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది..

రాశి:
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఈమె ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈమె కూడా నిజం సినిమాలో విలన్ గా నటించింది.

వీరితోపాటు వల్లభ సినిమాలో రీమాసేన్ కూడా నెగటివ్ రోల్ పోషించిన విషయం తెలిసిందే. ఇకపోతే మరికొందరు స్టార్ హీరోయిన్లు కూడా విలన్ షేడ్స్ లో నటించాలని ఆశ పడుతున్నారు. మరి ఆ హీరోయిన్లకు ఇలాంటి పాత్రలలో చేసే అవకాశం లభిస్తుందో లేదో చూడాలి. అంతేకాదు హీరోయిన్లు నెగిటివ్ రోల్స్ లో నటిస్తే నిర్మాతలు కూడా ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ ను ఆఫర్ చేస్తూ ఉండడం గమనార్హం.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు