Priyanka Singh: మూడుసార్లు చావు నుంచి బయటపడ్డ ప్రియాంక సింగ్.. ఏమైందంటే..?

ప్రముఖ ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు… ఒకప్పుడు జబర్దస్త్ లో లేడీ గెటప్లతో తేజ గా ప్రేక్షకులను అలరించిన ఈమె.. ఆ తర్వాత బిగ్ బాస్ షోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంది. బిగ్ బాస్ తర్వాత పలు టీవీ షోలు, సినిమా అవకాశాలతో బిజీగానే ఉంది. ఇకపోతే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడే తన కష్టాలను చెప్పుకున్న ప్రియాంక.. చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలు.. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా దూరం పెట్టారంటూ ఎమోషనల్ అయింది.. అయితే హౌస్ లోకి వెళ్ళాక వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి మళ్ళీ ఆమెను దగ్గర తీసుకోవడంతో ప్రియాంక ఎమోషనల్ అయింది.

ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ ని నడుపుతూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్న ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నది. అందులో తన వ్యక్తిగత విషయాల గురించి అలాగే తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది.. ప్రియాంక సింగ్ మాట్లాడుతూ.. నేను అమ్మాయిగా మారకముందు నా అసలు పేరు తేజ్ బహదూర్ సింగ్ ..కానీ నాలో అమ్మాయి లక్షణాలు ఉండడంతో అమ్మాయిగా మారాలనుకున్నాను.. అయితే అమ్మాయిగా మారాలి అంటే హార్మోన్ థెరపీ చేయించుకోవాలి.. ఇక అలా చేయించుకున్నాక ఎన్నో అవమానాలను ఇబ్బందులను ఎదుర్కొన్నాను..

అమ్మాయిగా మారిన తర్వాత చాలామంది.. ఇండస్ట్రీలోకి వచ్చాక అవకాశాల కోసం ఇలా మారిపోయావా అని అడిగారు.ఒకరిద్దరు నీతో ఉండాలని ఉంది.. ఒక్క నైట్ కి ఎంత ఛార్జ్ చేస్తావు అని కూడా అడిగారు.. అంతేకాదు చాలామంది చిన్నచూపు చూశారు అంటూ ఎమోషనల్ అయింది ..ఇక సోషల్ మీడియాలో ఈమధ్య బూతు మరింత ఎక్కువైందని.. చాలామంది నీచంగా కామెంట్స్ చేస్తున్నారని.. వాటిని పట్టించుకోకూడదు అంటూ ఆమె సలహా కూడా ఇచ్చింది.. అమ్మాయిగా మారినప్పుడు మొదట్లో ఊళ్లో వాళ్ళు కూడా రకరకాల మాటలు అనేవారు.. దాంతో ఒంటిమీద కిరోసిన్ పోసుకొని కాల్చుకున్నాను.. ఏకంగా మూడుసార్లు చావాలనుకున్నాను..కానీ మూడుసార్లు కూడా బ్రతికి బయటపడ్డాను.. దీంతో ఏదో సాధించాలని అర్థమైంది.. అందుకే ఇలా కష్టపడుతున్నాను అంటూ తెలిపింది ప్రియాంక సింగ్.. ఇకపోతే ప్రియాంక సింగ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు