Dunki OTT Streaming : “డంకీ” ఓటీటీ రిలీజ్‌కు ముందు తెలుగు ఆడియన్స్‌కు ట్విస్ట్…

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ అభిమానులు ఎంతో అద్భుతంగా ఎదురు చూస్తున్న “డంకీ” మూవీ ఎట్టకేలకు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. గతేడాది డిసెంబర్ 21న “సలార్” మూవీకి పోటీగా వచ్చిన ఈ మూవీ కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ అయింది. 470 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టిన ఈ మూవీ కమర్షియల్ గా పర్వాలేదు అనిపించినప్పటికీ ప్రేక్షకులను మాత్రం పెద్దగా మెప్పించలేకపోయింది. ఇక తాజాగా ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ విషయంలో నెట్ ఫ్లిక్స్ తీరుపై షారుక్ తెలుగు అభిమానులు మండిపడుతున్నారు.

పఠాన్, జవాన్ వంటి 1000 కోట్ల సినిమాలను అందుకున్న షారుక్ కొత్త మూవీ “డంకీ” భారీ అంచనాలతో డిసెంబర్ లో రిలీజ్ అయింది. వెండితెరపై పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ మూవీ ఓటిటి రిలీజ్ గురించి మాత్రం దేశవ్యాప్తంగా ఉన్న షారుక్ అభిమానులు ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. థియేటర్లలో ఈ మూవీని చూడలేకపోయిన వారు కనీసం ఇలాగైనా చూడాలని వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా వల్ల తెలుగు ఆడియన్స్ కు మాత్రం తీవ్ర నిరాశ ఎదురైంది. నిజానికి జనవరిలోనే ఓటీటీ లోకి రావాల్సిన “డంకీ” కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడేమో ఎలాంటి ప్రకటన లేకుండా నెట్ ఫ్లిక్స్ సైలెంట్ గా “డంకీ”ని రిలీజ్ చేసింది. కానీ ఇక్కడ కూడా షారుఖ్ అభిమానులకు అసంతృప్తి తప్పలేదు. “డంకీ” మూవీని నెట్ ఫ్లిక్స్ కేవలం హిందీ వర్షన్ లో మాత్రమే రిలీజ్ చేసింది. దీంతో ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్న తెలుగు ఆడియన్స్ నెట్ ఫ్లిక్స్ పై మండిపడుతున్నారు. ప్రస్తుతం సినిమాలు ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్నప్పుడు, అన్ని భాషల్లోనూ అందుబాటులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో నెట్ ఫ్లిక్స్ “డంకీ” ఓటిటి వర్షన్ ను కేవలం హిందీలోనే స్ట్రీమింగ్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మరి డబ్బింగ్ వర్షన్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.

ఇక ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో టాలీవుడ్ సినిమాలే టాప్ 10 లో కొనసాగుతున్నాయి. సలార్, యానిమల్, గుంటూరు కారం, హాయ్ నాన్న వంటి సినిమాలు టాప్ లో ఉన్నాయి. మరి ఇప్పుడు రిలీజ్ అయిన “డంకీ” ఓటిటిలో వీటికి పోటీగా వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా షారుక్ బిగ్ స్క్రీన్ పై ప్రభాస్ ను ఓడించలేకపోయాడు. “సలార్” సినిమాకు హిందీలో ఎక్కువ థియేటర్లో దక్కకుండా చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన “సలార్” సునామీ మాత్రం ఆగలేదు. ఆ సునామీలో “డంకీ” కొట్టుకుపోయింది.

- Advertisement -

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు