NTR : దాస్ కా ధమ్కీకి తారక్ సపోర్ట్ చేయటం వెనక ఇంత కథ ఉందా..?

యంగ్ హీరో విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తూ రూపొందించిన చిత్రం దాస్ కా ధమ్కీ. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. కానీ, విశ్వక్ కెరీర్ లోనే మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. దీనికి ప్రధాన కారణం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ హాజరవటమే అన్నది చాలా మంది అభిప్రాయం. విశ్వక్ సేన్ ఎన్టీఆర్ ఫ్యాన్ అన్న విషయం అందరికి తెలిసు. అయితే ఎన్నడూ లేనిది ఎన్టీఆర్ విశ్వక్ కు ఇలా ప్రత్యక్షంగా సపోర్ట్ ఇవ్వటం వెనక పెద్ద కథే ఉందని ఫిలిం సర్కిల్స్ లో గాసిప్స్ వినిపిస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే, ఆ మధ్య యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ హీరోగా మొదలవ్వాల్సిన సినిమా ఆరంభంలోనే వివాదాల్లో చిక్కుకొని అటకెక్కింది. ఆ సినిమా అలా అటకెక్కటానికి పరోక్షంగా ఎన్టీఆర్ కూడా కారణమే అన్నది వినిపిస్తున్న టాక్. అర్జున్ – విశ్వక్ ల సినిమా సమయంలో ఎన్టీఆర్ పలుమార్లు విశ్వక్ ని ప్రైవేట్ పార్టీలకు పిలిచినట్టు, స్వతహాగా ఎన్టీఆర్ వీరాభిమాని అయిన విశ్వక్, అర్జున్ సినిమా సంగతి పక్కన పెట్టి ఆ పార్టీలకు వెళ్ళటం అర్జున్ కు ఏ మాత్రం నచ్చలేదని, అయితే పలు మార్లు సినిమా షెడ్యూల్ ని పోస్ట్ పోన్ చేసినప్పటికీ విశ్వక్ తీరు మారక పోవటం తో సినిమా ఆపేయాల్సి వచ్చింది అన్నది గాసిప్ సారాంశం.

అయితే తన వల్ల విశ్వక్ సినిమా ఆగిపోయింది అని తెలుసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ దాస్ కా ధమ్కీ సినిమా విడుదల ఉండటం తో ఆస్కార్ వేడుక నుండి మధ్యలోనే హైదరాబాద్ బయల్దేరి వచ్చి, తన వల్ల జరిగిన తప్పు కి ప్రాయశ్చిత్తంగా విశ్వక్ కి సపోర్ట్ గా దాస్ కా ధమ్కీ ప్రై రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా హాజరైనట్లు తెలుస్తుంది.

- Advertisement -

అయితే అర్జున్ విశ్వక్ ల సినిమా వివాదం సమయంలో హీరో అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి సినిమా ఆగిపోవటానికి చెప్పిన కారణాలు వేరేలా ఉన్నాయి. విశ్వక్ సేన్ కు సాయి మాధవ్ బుర్ర రాసిన డైలాగ్స్ నచ్చలేదని, కధ విషయంలో తల దూర్చే వాడని, విశ్వక్ ప్రవర్తన వాళ్ళ షెడ్యూల్ డిస్టర్బ్ అయ్యేదని చెప్పుకొచ్చారు. మరి వీటిల్లో ఏది నిజం అన్నది తెలియాల్సి ఉంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు